telanagana
మైల్వార్లో నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని వినతి
బాషీరాబాద్ మేజర్ న్యూస్:మైల్వార్ గ్రామంలోని మహబూబ్ సుబాని దర్గా, ముస్లిం శ్మశానవాటిక, నమాజ్ ఈద్గా వద్ద వీధి దీపాల ఏర్పాటు కోసం నూతన విద్యుత్ స్తంభాలు, వైర్లు, విద్యుత్ కనెక్షన్లు కల్పించాలని మైల్వార్ గ్రామ పంచాయతీ తరఫున బషీరాబాద్ విద్యుత్ శాఖ ఏఈ (AE) కి వినతిపత్రం సమర్పించారు. ముస్లిం ప్రజల అభ్యర్థన మేరకు ఈ వినతి సమర్పించినట్లు స్థానికులు తెలిపారు.