నూజివీడు వైఎస్ఆర్సిపి చైర్మన్ అభ్యర్థిగా లవకుమార్
నూజివీడు, మేజర్ న్యూస్ : నూజివీడు పురపాలక సంఘం ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫు న మాజీ కౌన్సిలర్ యువజన నాయకుడు కంచర్ల లవ కుమార్ పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. గతంలో పురపాలక సంఘం కౌన్సిలర్ గా, పార్టీ నాయకునిగా ప్రజలకు సేవలు అందించారు. ఎస్సీ జనరల్ కేటాయించిన ఈ పదవి కోసం పార్టీలో పలువురు పేర్లను పార్టీ అధిష్టాన వర్గం పరిశీలించింది. తాజా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కొమ్ము వెంకటేశ్వరరావు, సుగుణ రావు,లవ కుమార్ పేర్లు పరిశీలనకు రాగా, చివరకు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు లవ్ కుమార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.