BREAKING
శ్రీ సరస్వతీ దేవిగా జ్వాలాముఖి అమ్మవారు స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సర్వం సిద్ధం: జాబితా విడుదల చేసిన పార్టీ కేంద్ర కార్యాలయం పశువైద్యుల క్యాడర్ సమస్యలపై పశుసంవర్ధక శాఖ సంచాలకులకు వినతి ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలికను తల్లికి అప్పగించిన అధికారులు మేయర్ అభ్యర్థిగా రూప్ కుమార్ యాదవ్ ఖరారు శ్రీ సరస్వతి అలంకారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్యదర్శనం* భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు జారీ చేసిన టౌన్ శ్రీమతి దీక్ష, స్థానిక ఎన్నికల్లో గెలిచి తీరాలి - కాకాణి" రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు..ఇంద్రకీలాద్రిపై సతీసమేతంగా కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం వైఎస్సార్‌సీపీలో చేరిన సీనియర్ నేత వందవాసి రంగ అభివృద్ధిపై చర్చకు సిద్ధం రైతుల పంట తరలింపు కు దారి చూపిన సర్పంచ్ లింగా నాయక్ మున్సిపాలిటీలో తొలిరోజు నామినేషన్ లు జీరో..! మూడుచింతలపల్లిలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా బీసీ రమేష్ గౌడ్ అధిష్ఠానం ప్రకటనతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ సిద్ధం: అంబాజీపేట మండల స్థాయి సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం

Select Suryaa Now
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ సిద్ధం: అంబాజీపేట మండల స్థాయి సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం

అంబాజీపేట మేజర్ న్యూస్ : రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థులను పూర్తిస్థాయిలో బరిలోకి దింపాలని అంబాజీపేట మండల కాంగ్రెస్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. అంబాజీపేట మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షులు దొమ్మేటి వినోద్ కుమార్ అధ్యక్షతన శుక్రవారం స్థానికంగా నిర్వహించారు. ఈ సమావేశంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన కార్యాచరణపై నాయకులు సమగ్రంగా చర్చించారు.

గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త ఐక్యంగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పాలకులు విఫలమవుతున్న తీరును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.

ఈ సమావేశంలో ఏఐసీసీ సభ్యులు జంగా గౌతమ్, పీసీసీ సభ్యులు మాచవరపు శివన్నారాయణ, ములపర్తి మోహన్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నెల్లి వెంకట రమణ, జిల్లా ఉపాధ్యక్షులు వాకపల్లి రాంబాబు, మహ్మద్ ఇస్మాయిల్, అబీబ్, పితాని నరసింహ మూర్తి, కొల్లు సరోజిని తదితరులు పాల్గొన్నారు.