BREAKING
శ్రీ సరస్వతీ దేవిగా జ్వాలాముఖి అమ్మవారు స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సర్వం సిద్ధం: జాబితా విడుదల చేసిన పార్టీ కేంద్ర కార్యాలయం పశువైద్యుల క్యాడర్ సమస్యలపై పశుసంవర్ధక శాఖ సంచాలకులకు వినతి ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలికను తల్లికి అప్పగించిన అధికారులు మేయర్ అభ్యర్థిగా రూప్ కుమార్ యాదవ్ ఖరారు శ్రీ సరస్వతి అలంకారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్యదర్శనం* భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు జారీ చేసిన టౌన్ శ్రీమతి దీక్ష, స్థానిక ఎన్నికల్లో గెలిచి తీరాలి - కాకాణి" రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు..ఇంద్రకీలాద్రిపై సతీసమేతంగా కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం వైఎస్సార్‌సీపీలో చేరిన సీనియర్ నేత వందవాసి రంగ అభివృద్ధిపై చర్చకు సిద్ధం రైతుల పంట తరలింపు కు దారి చూపిన సర్పంచ్ లింగా నాయక్ మున్సిపాలిటీలో తొలిరోజు నామినేషన్ లు జీరో..! మూడుచింతలపల్లిలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా బీసీ రమేష్ గౌడ్ అధిష్ఠానం ప్రకటనతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం

మొదటి రోజు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తి.. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్..

Select Suryaa Now
మొదటి రోజు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తి.. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్..

అమలాపురం,   మేజర్ న్యూస్ :రెండవ సాధారణ ఎన్నికలు–2026లో భాగంగా జిల్లాలోని పురపాలక సంఘాల ఎన్నికలకు సంబంధించి మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తయిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ తెలిపారు.
జిల్లాలోని అమలాపురం, రామచంద్రపురం, ముమ్మిడివరం పురపాలక సంఘాల పరిధిలో చైర్‌పర్సన్, వార్డు సభ్యుల పదవులకు సంబంధించి శుక్రవారం నామినేషన్ల స్వీకరణ చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
అమలాపురం పురపాలక సంఘం
అమలాపురం పురపాలక సంఘంలో చైర్‌పర్సన్ పదవికి మొదటి రోజు ఎలాంటి నామినేషన్ పత్రాలు స్వీకరించలేదని కలెక్టర్ తెలిపారు. మొత్తం 36 వార్డులకు గాను 12వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి సంబంధించి ఒక నామినేషన్ పత్రం స్వీకరించినట్లు పేర్కొన్నారు. మిగిలిన 35 వార్డులకు సంబంధించి మొదటి రోజు నామినేషన్లు స్వీకరించలేదని వివరించారు.
రామచంద్రపురం పురపాలక సంఘం
రామచంద్రపురం పురపాలక సంఘంలో చైర్‌పర్సన్ పదవికి మొదటి రోజు ఎలాంటి నామినేషన్ పత్రాలు స్వీకరించలేదని కలెక్టర్ తెలిపారు. మొత్తం 32 వార్డులకు గాను 6వ, 20వ వార్డులకు సంబంధించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు స్వీకరించినట్లు పేర్కొన్నారు. మిగిలిన 30 వార్డులకు సంబంధించి మొదటి రోజు నామినేషన్లు స్వీకరించలేదని తెలిపారు.
ముమ్మిడివరం పురపాలక సంఘం:
ముమ్మిడివరం పురపాలక సంఘంలో చైర్‌పర్సన్ పదవికి మొదటి రోజు ఎలాంటి నామినేషన్ పత్రాలు స్వీకరించలేదని కలెక్టర్ వెల్లడించారు. మొత్తం 23 వార్డులకు సంబంధించి కూడా మొదటి రోజు ఎలాంటి నామినేషన్ పత్రాలు స్వీకరించలేదని తెలిపారు.పురపాలక సంఘాల ఎన్నికల ప్రక్రియను ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు