ఎల్ నినోను సమర్థవంతంగా ఎదుర్కొందాం
ఆమనగల్లు, రంగారెడ్డి:
ఎల్ నినో ప్రభావం పంటలపై పడకుండా ప్రతి ఒక్కరం బాధ్యతాయుతంగా సమిష్టిగా ఎదుర్కోవాలని మండల వ్యవసాయ అధికారి పెద్ది శ్రీనివాస్ గౌడ్ సూచించారు. మండల పరిధిలోని మంగళ పల్లి గ్రామంలోశుక్రవారం ఎల్ నినో ప్రభావంతో రైతులు సాగు చేస్తున్న ప్రత్యాన్మాయ పంటల సాగు పై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మౌనిక, వార్డు సభ్యులు, రైతులు, గ్రామస్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎల్ నినో ప్రభావంతో పంటలపై చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, వరి సాగు తగ్గించుకోవాలని, నీటి వసతి ఉన్న రైతులు తక్కువ రోజుల్లో పంటలు చేతికొచ్చే జొన్న, మొక్కజొన్న, శెనిగ, కూరగాయలు, మినుములు, సజ్జలు, కందులు వంటి పంటలు సాగు చేసుకోవాలని శ్రీనివాస్ గౌడ్ సూచించారు. మంచినీటిని వృధా చేయకుండా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, బోర్ వెల్ రీఛార్జ్ గుంతల నిర్మాణం, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు,పారం పండ్స్ ల ఏర్పాటు, పశువుల నీటి తొట్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. అదేవిధంగా పశుగ్రాసం అందుబాటులో ఉంచుకోవడంతో పాటు, గ్రామస్తులు వి బి జి రాంజీ పథకం ద్వారా ఉపాధి పొందాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జగన్, ఫీల్డ్ అసిస్టెంట్, అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఎ, చంద్రశేఖర్ మేజర్ న్యూస్,