పతంజలి యోగ కేంద్రంలోని అమ్మవారికి మున్సిపల్ చైర్మన్ దంపతుల పూజలు
ఫరూఖ్ నగర్ రంగారెడ్డి :; షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో దేవి శరణ నవరాత్రుల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పట్టణంలోని పతంజలి యోగా సెంటర్లో ప్రతిష్ఠించిన అమ్మవారిని షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, ఆయన సతీమణి అగ్గనూర్ జగదేవి దంపతులు, మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ విశాల విశ్వం దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు సమర్పించి, భక్తితో మొక్కులు చెల్లించుకున్నారు. నవరాత్రుల పర్వదినాల్లో అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం అమ్మవారి పల్లకి సేవలో పాల్గొన్నారు,ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్ దంపతులు ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ రెడ్డి,మున్సిపల్ కౌన్సిలర్ సి పెంటయ్య మురళీమోహన్ రాజు నాయక్, ప్రముఖ వ్యాపారవేత బెజవాడ హనుమంతరావు, ప్రముఖ సీనియర్ న్యాయవాది చెంది మహేందర్ రెడ్డి , పల్లె శ్రీనివాసరెడ్డి టాప్స్ అండ్ వెంకటేష్ , అగ్గనూర్ కిట్టు, అభిషేక్, కార్తిక్, తదితరులు పాల్గొన్నారు…
నరసింహ రెడ్డి మేజర్ న్యూస్…..