హిందూపురంలో అంతర్రాష్ట్ర ఎక్సైజ్ అధికారుల సమావేశం
హిందూపురం :- రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ఎక్సైజ్ అధికారుల అంతర్రాష్ట్ర సమావేశం హిందూపురం ఎక్సైజ్ స్టేషన్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో అక్రమ మద్యం రవాణా, కల్తీ కల్లు విక్రయాల నియంత్రణ, సరిహద్దు నేరాల కట్టడి, పాత నేరస్తుల అరెస్టులు, నిందితుల సమాచార మార్పిడి పై చర్చించారు. అక్రమ కార్యకలాపాలపై ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో ప్రతి వారం సంయుక్త దాడులు నిర్వహించాలని నిర్ణయించారు.ఈ సమావేశంలో హిందూపురం ఎక్సైజ్ సీఐ లక్ష్మీ దుర్గయ్య, తుముకూరు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ దీపక్, పావగడ ఎక్సైజ్ సీఐ మైఖేల్ జార్జ్, మధుగిరి ఎక్సైజ్ సీఐ శ్రీలత తో పాటు పలువురు ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.
హిందూపురం సూర్య స్టాప్ రిపోర్టర్ నాగేంద్ర