BREAKING
చక్రయాత్ర - నవదుర్గ దర్శనం - 6 ఆజ్ఞాచక్రంలో అమ్మవారి ఆజ్ఞ - కాత్యాయనీ దర్శనం (అంతర్ దృష్టికి, అంతర్గత జ్ఞానానికి ప్రతీక) కాంగ్రెస్ కి పూర్వ వైభవం తీసుకురావడానికి సమష్టిగా కృషి చేయాలి --స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు పోటీకి సిద్ధం కావాలి --మాజీ మంత్రి, పిసిసి జిల్లా ఇన్చార్జ్ ఎన్. రఘువీరారెడ్డి మీనంపల్లి కలాన్‌లో గ్రామపంచాయతీ సామగ్రి చోరీ బొంపల్లి బిడ్డకు పోలీస్‌ శిక్షణలో గుర్తింపు క్రీడలతోనే విద్యార్థుల సమగ్ర వికాసం* అమ్మవారి పీఠాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే చింతమనేని మొదటి రోజు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తి.. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్.. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం.. రీ-సర్వేతో రైతులకు భరోసా:బషీరాబాద్ తహసీల్దార్ షాహిదా బేగం ఉక్రెయిన్ సరిహద్దులో నాన్-నెగోషియేబుల్ భద్రతా మండలి నిర్మాణం *బతుకమ్మ మెట్లను పరిశీలించిన ఎమ్మెల్యే* మైల్వార్‌లో నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని వినతి *నాట్య మయూరి సినీత విజయకి ఘన సత్కారం* జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఖమ్మంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు ఆసుపత్రి నుంచి పుతిన్‌తో పోప్ సిఫ్రియన్ ఫోన్ కాల్ *భవాని మాత, సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే*

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లమిల్లి

Select Suryaa Now
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లమిల్లి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం మండపేట మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ఊపందుకుంటున్నాయి. ఈ క్రమంలో 24వ వార్డుకు చెందిన టిడిపి నాయకుడు నల్లమిల్లి శ్రీనాథ్ రెడ్డి మండపేట వైసిపి ఇన్ ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మండపేట విజయ లక్ష్మీ నగర్ లోని వైసిపి కార్యాలయంలో ఆయనకు వైసిపి పార్టీ కండువా కప్పి తోట త్రిమూర్తులు సాదరంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా నల్లమిల్లి శ్రీనాథ్ రెడ్డి సతీమణి నల్లమిల్లి రామలక్ష్మిని 24వ వార్డు(టిడ్కో ఏరియా) కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రకటించారు.

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా వార్డులోని నాయకులందరూ విభేదాలకు తావులేకుండా కలిసికట్టుగా పనిచేస్తామని స్పష్టం చేశారు. వార్డు ప్రజల సహకారంతో రామలక్ష్మి విజయానికి సమష్టిగా కృషి చేస్తామని నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మేక శ్రీను, యాదగని చంటి, గునిపే భూషణం, కోణాల బోస్, బత్తిన దొరబాబు, సింగర్ రాజు, పెనుబోతుల సత్తిబాబు తదితర నాయకులు పాల్గొన్నారు