BREAKING
సొంత నిధులతో ఆడపడుచులకు బతుకమ్మ కానుక.. సర్పంచ్ రాజు ఔదార్య వంగర ఎస్ఐ గా మెరుగు రాజు బాధ్యతల స్వీకరణ విద్యుత్ కోతలపై ప్రజలకు సమాధానం చెప్పాలి.. నడకే దివ్య ఔషధం.. ఆరోగ్యానికి ఆయువుపట్టు.... ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ సూర శ్రీనివాసరావు చిన్న పిల్లల దసరా వేడుకలు.. చిన్ననాటి జ్ఞాపకాల గుర్తు చేసుకున్న కలెక్టర్ అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు పలాస, ఇచ్ఛాపురం మునిసిపల్ ఎన్నికల నిర్వహణపై ఫేజ్–1 శిక్షణ సమావేశం వికారాబాద్ నియోజకవర్గానికి రూ.5.90 కోట్ల నిధులు.. మూడు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి జీవోలు జారీ 'మిస్టర్ ఇండియా' పోటీల్లో సత్తా చాటిన ధిల్లేశ్వరరావు.... ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే గొండు శంకర్ దుర్గామాతను దర్శించుకున్న మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి నంగునూరు ఉద్యోగుల సంక్షేమ సంస్థ నూతన కార్యవర్గం మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన పాలకొండ సబ్-కలెక్టర్ డైరెక్టర్ల ఎన్నిక ఏకగ్రీవం హుస్నాబాద్‌ పురపాలక సంఘంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు

అభివృద్ధిని చూసి కూటమి అభ్యర్థులను ఏకగ్రీవంగా గెలిపించండి.

Select Suryaa Now
అభివృద్ధిని చూసి కూటమి అభ్యర్థులను ఏకగ్రీవంగా గెలిపించండి.

పాలకొల్లు మేజర్ న్యూస్: నియోజకవర్గంలో గత రెండేళ్లుగా పెద్దఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపట్టామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభివృద్ధిని చూసి కూటమి అభ్యర్థులను ఏకగ్రీవంగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వ్యక్తులు, పార్టీలు, కులాలు, మతాలను కాకుండా అభివృద్ధిని ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. గురువారం పాలకొల్లులోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, మంజూరైన నిధుల వివరాలను వెల్లడించారు.

 

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పాలకొల్లులో అభివృద్ధి జరిగిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు మరింత వేగవంతమయ్యాయని మంత్రి పేర్కొన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని, గత టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన పనులను సైతం గత ప్రభుత్వం విధ్వంసం చేసిందని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమంలో పాలకొల్లు నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని, మరో మూడేళ్లలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌కు నాలుగైదు రోజుల ముందే నియోజకవర్గానికి సుమారు రూ.50 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి వివరించారు. 2019లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇమిడి సత్యనారాయణ ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకల స్థాయికి పెంచేందుకు భవన నిర్మాణానికి రూ.12.60 కోట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. ఏడాదిలో పూర్తికావాల్సిన నిర్మాణం ప్రభుత్వం మారడంతో ఐదేళ్లయినా పూర్తికాలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరో రూ.16 కోట్ల వరకు మంజూరు చేయడంతో పనులు కొనసాగుతున్నాయని, పాత ఆసుపత్రి భవనం స్థానంలో కొత్త భవన నిర్మాణానికి తాజాగా మరో రూ.24.50 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి మొత్తంగా రూ.50 కోట్లకు పైగా నిధులు సమకూర్చామని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆసుపత్రి అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు.

పాలకొల్లు మున్సిపాలిటీ పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులు రూ.3 కోట్లతో బ్రాడీపేట మంచినీటి చెరువు వద్ద, ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల్లో సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మరో రూ.6 కోట్లతో బ్రాడీపేట మంచినీటి చెరువు, ప్రభుత్వ ఆసుపత్రి సమీపంతోపాటు 27వ వార్డు లజపతిరాయ్‌పేట, 12వ వార్డు డంపింగ్‌ యార్డు ప్రాంతం, 25వ వార్డు ఏవీఎస్‌ కాలనీ, టిడ్కో గృహాల కాలనీలో పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.

పాలకొల్లులో గౌడ శెట్టిబలిజ కల్యాణ మండప నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.1.50 కోట్లు మంజూరు చేశామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి విడతలో రూ.3 కోట్లు, రెండో విడతలో మరో రూ.3 కోట్లు కేటాయించడంతో మొత్తం రూ.7.50 కోట్లతో పనులు జరుగుతున్నాయని చెప్పారు. టిడ్కో గృహాల కాలనీలో రూ.49.50 లక్షలతో రైతుబజారు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పుష్కర నిధులు రూ.9.30 కోట్లతో సీసీ రహదారులు, డ్రెయిన్ల నిర్మాణ పనులు చేపడుతున్నామని, రూ.2.40 కోట్లతో పాలకొల్లు, దగ్గులూరు, వెంకటాపురం పశువుల ఆసుపత్రులను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు.

నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డులో అభివృద్ధి పనులు కనిపించేలా కృషి చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రజలకు మంచి జరగాలని, వారు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించే కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. రాబోయే రోజుల్లో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించి పాలకొల్లును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో కూటమి నాయకులు పాముల రజనీ కుమార్, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, మామిడి శెట్టి పెద్దిరాజు, బోనం చినబాబు, బోనం నాని, తులా రామలింగేశ్వరరావు, జత్తుగా రీనా, పి. రాంబద్ర రాజు, దాసరి రత్నం రాజు, మాత రత్నరాజు, ఆరుమిల్లి చిన్ని, రుద్రరాజు సత్యనారాయణ రాజు, తాళ్ల నాగరాజు, పీతల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు