BREAKING
అసెంబ్లీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులతో నాయకర్ సమావేశం 'కామ్రేడ్ కళ్యాణ్' భారీ విజయం సాధించడంతో తిరుమలకు శ్రీవిష్ణు.. శ్రీవారిని దర్శించుకున్న హీరో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిదే పై చేయి.. రెడ్డప్ప రెడ్డి. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు అందిస్తున్న ఉచిత కోచింగ్ బుచ్చిలో ఇద్దరు టిడిపి సీనియర్ల రాజీనామా విశ్వవిద్యాలయ వనరులతో... ఉపాధి సృష్టికర్తలగా ఎదగాలి ఆదిత్య యూనివర్సిటీ ఛాన్స్లర్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి వైసీపీ నెల్లూరు జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా బొమ్మిరెడ్డి తండ్రి మృతికి కారణమైన వ్యక్తికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష -- జరిమానా విధింపు కళ్యాణదుర్గం మున్సిపల్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దొడగట్ట హర్షిని ఖరారు కొత్త ఓఆర్ ఆర్ రైతులకు మందులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు..ఏవో స్రవంతి ఎమ్మెల్యేభూమా అఖిలప్రియ సమక్షంలో వైకాపా నుండి తెదేపాలో చేరిక మర్రిపాడులో రైతు మహిళా దినోత్సవం కూరగాయలతో అన్నపూర్ణ దేవి అలంకరణ లో దర్శనం ఇచ్చిన మాతా పరమేశ్వరి ఆత్మకూరు మున్సిపాలిటీలో నేటి నుండి నామినేషన్ల స్వీకరణ

'మిస్టర్ ఇండియా' పోటీల్లో సత్తా చాటిన ధిల్లేశ్వరరావు.... ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే గొండు శంకర్

Select Suryaa Now
'మిస్టర్ ఇండియా' పోటీల్లో సత్తా చాటిన ధిల్లేశ్వరరావు.... ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే గొండు శంకర్

శ్రీకాకుళం, సూర్య : శ్రీకాకుళం: జైపూర్ వేదికగా జరిగిన 58వ మిస్టర్ ఇండియా బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో శ్రీకాకుళం కుర్రాడు కండల సత్తా చాటాడు. ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో 75 కిలోల విభాగంలో బరిలోకి దిగిన రెడ్డి ధిల్లేశ్వరరావు.. జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానంలో నిలిచాడు. దేశవ్యాప్తంగా ఎంతోమంది ఉద్ధండులు పోటీపడిన ఈ వేదికపై రజత పతకం కైవసం చేసుకుని, జిల్లాకే గర్వకారణంగా నిలిచాడు. ఈ అరుదైన ఘనత సాధించి స్వగ్రామానికి చేరుకున్న ధిల్లేశ్వరరావును శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఘనంగా సత్కరించారు. విజేతను స్వయంగా కలిసిన ఎమ్మెల్యే.. శాలువాతో సత్కరించి, జ్ఞాపికను (ట్రోఫీని) బహూకరించి ఆత్మీయంగా అభినందించారు. జాతీయ స్థాయిలో మన ప్రాంత ప్రతిష్టను ఇనుమడింపజేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. యువతకు ధిల్లేశ్వరరావు కఠోర శ్రమ ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. భవిష్యత్తులో మరింతగా రాణించి ఏకంగా 'మిస్టర్ ఇండియా' టైటిల్‌నే సొంతం చేసుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ ఉత్సాహభరిత వాతావరణంలో ఉప్పంగి పంచాయతీకి చెందిన కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని క్రీడాకారుడికి తమ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

 

రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.