ఎమ్మెల్యేభూమా అఖిలప్రియ సమక్షంలో వైకాపా నుండి తెదేపాలో చేరిక
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమక్షంలో వైసీపీ నుండి తెదేపాలో చేరిక
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమక్షంలో గురువారం వైకాపాకు చెందిన 10 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. నియోజకవర్గంలోని
సిరివెళ్ల మండలం యర్రగుంట్ల గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీకి చెందిన 10 కుటుంబాలు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమక్షంలో వైసీపీని వీడి టిడిపిలోకి రావడం జరిగింది.పూల వెంకట రాముడు, పూల బాలన్న, దారం బాల ఓబన్న,దారం చిన్న ఓబన్న, బిచ్చుకట్ల బాల ఓబన్న, బిచ్చు కట్ల చిన్న ఓబన్న, పాటు 10 కుటుంబాలు వైసీపీ ని వీడి కండువా కప్పుకున్నారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి వైసీపీని వీడి టిడిపిలోకి రావడం జరిగిందని తెలిపారు. అనంతరంఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వైసిపి పార్టీలో ఉండే వారు లేకుండా సిరివెళ్ల మండలం టిడిపి కంచుకోటగా చేస్తామన్నారు.