గెలుపే లక్ష్యంగా సమైక్యంగా పని చేయాలి
ఇంకొల్లు, మేజర్న్యూస్ :
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమైక్యంగా పని చేయాలని ఇంకొల్లు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాయుడు హనుమంతరావు పిలుపునిచ్చారు.
ఇంకొల్లు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇంకొల్లు మండల కమిటీ సమావేశం లో ఆయన పాల్గొని మాట్లాడారు. సంస్థల ఎన్నికల గురించి వార్డులవారీగా, గ్రామాల వారీగా చర్చించారు. రిజర్వేషన్లు వెలువడిన వెంటనే అభ్యర్థుల ఎంపిక, గెలుపు గురించి చేయాల్సిన వ్యాహాలను గురించి చర్చించారు. సమావేశంలో పర్చూరు ఏఎంసీ చైర్మన్ గుంజి వెంకట్రావు, ఇంకొల్లు పిఎసిఎస్ చైర్మన్ కరి శ్రీనివాసరావు, కొనికి సొసైటి చైర్మన్ బోడెంపూడి సుబ్బారావు, పావులూరు పిఎసిఎస్ చైర్మన్ నారిశెట్టి రాంబాబు, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి పాలేరు రామకృష్ణ , ఇంకొల్లు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి వడ్లమూడి సాంబయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు యూనిట్ ఇన్చార్జి మాజీ మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సూర్య రిపోర్టర్ : షేక్ జానిబాష, ఇంకొల్లు.