శివాలయం అవినీతి ఆరోపణలు నిరూపించండి
గూడూరు మేజర్ న్యూస్ : గూడూరు పట్టణంలోని స్వయంభు మూలస్థానేశ్వర స్వామి శివాలయంలో అభివృద్ధి పనుల పేరుతో చైర్మన్ విరాళాలు వసూలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారంటూ పాలకమండలి సభ్యుడు ఎం గురునాథం చేసిన ఆరోపణలను ఆలయ చైర్మన్ బాలకృష్ణ నాయుడు తీవ్రంగా ఖండించారు. గురువారం చైర్మన్ గురునాధం ఆరోపణలు నిరాధారమని పేర్కొంటూ, వాటిని ఆధారాలతో నిరూపించాలని గురునాథంకు ఆయన సవాల్ విసిరారు. తాను చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భక్తులు, పాలకమండలి సభ్యుల సహకారంతో ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఆలయంలో నిర్వహించే కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. భక్తుల నుంచి విరాళాల రూపంలో సేకరించిన నగదును ఆలయ అభివృద్ధి పనులకు వినియోగించామని వివరించారు. ప్రతిదాతకి రసీదు ఇస్తామని చైర్మన్ తెలిపారు. నీవు శివాలయంకి
శివుడు దగ్గర నేను దాతలు డబ్బులు ఒక్క రూపాయి కూడా దేవాలయానికి ఇవ్వకుండా 20 లక్షల వరకు ఇంటికి తీసుకెళ్లారని పలికావు అందుకే శివాలయంలో ప్రమాణం చెయ్యి, నేను గతంలో పెద్ద వ్యాపారవేత్తని, ఆర్థికంగా స్థిరపడిన వ్యక్తినని, దేవాలయం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం నాకు లేదన్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఆలయ ని ధుల ద్వారా వ్యక్తిగతంగా లబ్ధి పొందాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అరుణ్ కుమార్, వసుధ ,మమత, విజయ, ప్రధాన అర్చకులు నరేష్ కుమార్ శర్మ, ఆలయ వాచ్మెన్ రంగారెడ్డి, పాల్గొన్నారు.