ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలి
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలి :సీఐ సుబ్రహ్మణ్యం
కనిగిరి ,మేజర్ న్యూస్ :త్వరలో జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు సహకరించాలని సీఐ వి సుబ్రహ్మణ్యం అన్నారు .కనిగిరి పట్టణంలోని సీఐ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు .ఈ సంధర్భంగా సీఐ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల దృష్ట్యా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు .ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు .ఎన్నికల నేపథ్యంలో పోలీసు చెక్ పోస్టులు ,ఫ్లయింగ్ స్క్వాడ్ లు నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు .గ్రామాల్లో ఏమైనా అల్లర్లు ఉత్పన్నమయితే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకరావాలని సూచించారు .చిన్న చిన్న విషయాలకు గొడవలు పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు .ఎన్నికల నిభందనలు అతిక్రమిస్తే అట్టివారిపై చట్టరిత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు .ఈ సమావేశంలో ఎస్సై జి సందీప్ ఉన్నారు .