BREAKING
కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులు పడ్డా.. ఆ హీరో వల్లే నా జీవితం మారిపోయింది: శ్రుతి హాసన్ ఈరవత్రి అనిల్‌కు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇవ్వాలి: పద్మశాలి సంఘం నేతల విజ్ఞప్తి రూ.2 లక్షల ఎల్‌ఓసీ అందించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎల్లంపేట్ మున్సిపాలిటీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నాగుల ఆనంద్ యాదవ్ బాసర మూల నక్షత్రం వేడుకలకు 200 మంది పోలీసులతో పటిష్ట భద్రత జొన్నవాడలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన కామాక్షి తాయి బైండోవర్ 27 ఏళ్ల వివాహ బంధం.. అరుదైన ఫొటోలతో మాధురి దీక్షిత్ దంపతుల వెడ్డింగ్ యానివర్సరీ వేడుక! పరిగి లో వైభవంగా బతుకమ్మ వేడుకలు రవీందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పైలెట్ రోహిత్ రెడ్డి 'రణబాలి' చిత్రంలో జయమ్మగా యాంకర్ సుమ.. వైరల్ అవుతున్న ప్రత్యేక లుక్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన... మిరియాల రాఘవరావు,మిరియాల ప్రీతమ్ చిన్ననాటి ఫొటోలో అందాల క్యూట్ పాప ఎవరో గుర్తుపట్టారా?.. ఇప్పుడు టాలీవుడ్‌ను ఏలుతున్న స్టార్ హీరోయిన్! బైండోవర్ కేసులు నమోదు చేస్తాం...ఎస్సై..!

ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి :సబితా రెడ్డి

Select Suryaa Now
 ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి :సబితా రెడ్డి

శక్తి స్వరూపుని దుర్గాదేవి *దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి 

అమ్మవారి పూజలో పాల్గొన్న సబితా ఇంద్రారెడ్డి

. తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలలో పూజలు అందుకుంటున్న దుర్గాదేవి శక్తి స్వరూపిణి అని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిహెచ్ఎంసి జల్ పల్లి సర్కిల్ పరిధి, శ్రీరామ కాలనీ, జల్ పల్లి గ్రామంలో వివిధ మండపాలలో ప్రతిష్టించిన అమ్మవార్లను దర్శించుకొని, ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండపాల నిర్వహకులు సబితా ఇంద్రారెడ్డికి ఘన స్వాగతం పలికి, శాలవాతో ఘనంగా సత్కరించి, అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. జల్ పల్లి డివిజన్ పరిధిలో ప్రతిష్టించిన దుర్గామాత మండపాలు భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అమ్మవారికి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఎంతో భక్తి భావంతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. జల్ పల్లి డివిజన్ ప్రజలకు ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తులు ఆదిపరాశక్తి అమ్మవారికి తొమ్మిది అవతారాలలో, తొమ్మిది రోజులు ఎంతో భక్తితో పూజలు నిర్వహిస్తారని అన్నారు. ఆ దుర్గాదేవి అమ్మవారి కృపా కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో జల్ పల్లి నాయకులు, కార్యకర్తలు, మండపాల నిర్వాహకులు, భక్తులు, మహిళలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.                

-అంకం జగన్ : మేజర్ న్యూస్, జల్ పల్లి.