గురువారం సంతలో ఏ ఊరు వారైనా ఎవరైనా కొనుగోలు అమ్మకాలు చేయవచ్చు: సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్
గురువారం సంతలో ఏ ఊరు వారైనా ఎవరైనా కొనుగోలు అమ్మకాలు చేయవచ్చు: సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్
మునుగోడు,మేజర్ న్యూస్:
మునుగోడు మండల కేంద్రంలో గురువారం నిర్వహించే సంతలో ఏ ఊరు వారైనా ఎవరైనా కొనుగోలు, అమ్మకాలు చేయవచ్చునని సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.మునుగోడు గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతీ గురువారం నిర్వహించే సంత (అంగడి) గ్రామ పంచాయతీ నిబంధనల ప్రకారం వేలం పాట నిర్వహించడం జరిగిందన్నారు. సంతకు (అంగడి) కేటాయించిన స్థలంలోనే ఏర్పాటు చేసుకోవాలని, వ్యాపారం చేసుకోవాలని సూచించారు.ఎవరైనా గ్రామ పంచాయతీ నిబంధనలను అతిక్రమిస్తే, గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయనీ పేర్కొన్నారు.