BREAKING
జొన్నవాడలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన కామాక్షి తాయి బైండోవర్ 27 ఏళ్ల వివాహ బంధం.. అరుదైన ఫొటోలతో మాధురి దీక్షిత్ దంపతుల వెడ్డింగ్ యానివర్సరీ వేడుక! పరిగి లో వైభవంగా బతుకమ్మ వేడుకలు రవీందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పైలెట్ రోహిత్ రెడ్డి 'రణబాలి' చిత్రంలో జయమ్మగా యాంకర్ సుమ.. వైరల్ అవుతున్న ప్రత్యేక లుక్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన... మిరియాల రాఘవరావు,మిరియాల ప్రీతమ్ చిన్ననాటి ఫొటోలో అందాల క్యూట్ పాప ఎవరో గుర్తుపట్టారా?.. ఇప్పుడు టాలీవుడ్‌ను ఏలుతున్న స్టార్ హీరోయిన్! బైండోవర్ కేసులు నమోదు చేస్తాం...ఎస్సై..! దేవి మండపాలను దర్శించిన కాంగ్రెస్ నేత ఉపేందర్ రెడ్డి న్యూయార్క్ నియంత్రణ సంస్థకు 33 మిలియన్ డాలర్లు చెల్లించిన ఎస్ఈబీ (SEB) బ్యాంక్ ఆరోగ్యానికి శ్రీరామరక్ష జొన్న రొట్టె.. ఉదయాన్నే రెండు తింటే కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులుండాలి:మాజీ మంత్రి తలసాని ఇంటర్నేషనల్ పేపర్ యూరోపియన్ ప్యాకేజింగ్ విభాగంపై ప్రైవేట్ ఈక్విటీ సంస్థల కన్ను పర్యావరణ పరిరక్షణ కోసం ముందుకు వస్తున్న సరికొత్త క్లైమేట్ టెక్నాలజీలు

అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్‌

Select Suryaa Now
అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్‌

 

- నిందితుడి వద్ద నుండి 80 వేలు విలువచేసే ఆరు స్మార్ట్‌ఫోన్లు స్వాధీనం

తాళం వేసిన ఇళ్లు, దుకాణాలే లక్ష్యం.. రూ.80 వేల విలువైన ఫోన్ల రికవరీ

మఠంపల్లి, మేజర్ న్యూస్ :మండల కేంద్రంలోని మొబైల్‌ దుకాణంలో చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర నిందితుడిని మఠంపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి వద్ద నుంచి సుమారు రూ.80 వేల విలువైన ఆరు స్మార్ట్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హుజూర్‌నగర్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ చరమంద రాజు కేసు వివరాలను  గురువారం మీడియాకు వెల్లడించారు.
గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన చక్రవర్తి అలియాస్‌ బాబు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రాత్రి వేళల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లు, దుకాణాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒకటి, చైతన్యపురి పరిధిలో ఒకటి, కోదాడ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మూడు చోరీ కేసులు నమోదయ్యాయి. 2023లో కోదాడ టౌన్‌ పరిధిలోని మూడు కేసుల్లో అతడిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపినట్లు సీఐ తెలిపారు.ఇటీవల మఠంపల్లిలోని ఓ మొబైల్‌ దుకాణంలో నిందితుడు చోరీకి పాల్పడ్డాడు. దొంగిలించిన ఫోన్లను ఇతరులకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఫోన్లలో వినియోగించిన కొత్త సిమ్‌ కార్డులు, కాల్‌ డేటా రికార్డులను విశ్లేషించి నిందితుడి ఆచూకీని గుర్తించారు.మరోసారి నేరానికి పాల్పడేందుకు నిందితుడు మఠంపల్లికి వచ్చినట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి ఆరు స్మార్ట్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చరమంద రాజు వెల్లడించారు. ఈ కేసు ఛేదనలో మఠంపల్లి ఎస్‌ఐ ప్రవీణ్‌ కుమార్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.