మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : దేవి నవరాత్రి ఉత్సవా లను పురస్కరించుకుని నేరేడ్ మెట్ డివిజన్ పరిధిలో ని సప్తగిరికాలనీలో నెలకొల్పిన అమ్మవారి మండపాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, డివిజన్ మాజీ కార్పొరేటర్ కొత్త పల్లి మీనా భర్త కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి దర్శించుకున్నా రు. మాజీ కౌన్సిలర్ ఎస్ ఆర్ ప్రసాద్ తో కలిసి దేవీ మండపంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు వారిని, శాలువాలతో ఘనంగా సన్మానించారు. దేవీ మండప నిర్వాహకులు ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాటు చేసిన అన్నప్రసాదం పంపిణీని ఆయన ప్రారంభించారు.