BREAKING
హత్య కేసులో భార్యాభర్తలు అరెస్ట్ --స్మార్ట్‌ఫోన్ స్వాధీనం ఆసియా పతక విజేతలతో ప్రధాని మోడీ సమావేశం మేడ్చల్ డిపో TJMU ఘన విజయం.. గౌరవ అధ్యక్షుడిగా జగన్ గౌడ్, సెక్రటరీగా శ్రీనివాస్ మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణం.. క్రమశిక్షణ, కష్టం తోలినాళ్ల నుంచి అగ్రస్థానం వరకు! ముంబైలో లగ్జరీ ఆఫీస్ స్పేస్‌ను లీజుకిచ్చిన సైఫ్ అలీ ఖాన్.. ప్రతినెలా భారీగా వస్తున్న అద్దె! కొలిక్కి వస్తున్న సీట్ల సర్దుబాటు ఎన్నికల పరిశీలకులుగా 28 మంది ఐఏఎస్‌ల నియామకం మొలకెత్తిన గింజలు తింటే నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా?.. వీటిని తినే సరైన విధానం ఇదే! పిల్లలు మొబైల్ ఫోన్‌కు ఎందుకు బానిసలవుతున్నారు?.. తల్లిదండ్రులు తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే! మల్లారెడ్డిగూడెంకు మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి.. స్పీకర్‌కు సర్పంచ్ వినతి స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపుకు కృషి చేయండి చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ రేసులో ' మీసాల ' ? .....పోటీ ' బెల్లాన వర్సెస్ మీసాల' కానుందా?.... అక్రమంగా అమర్చిన 12 మోటార్లు స్వాధీనం డాక్టర్ బి.వి. రాజు 106వ జయంతి.. ఘనంగా సేవా కార్యక్రమాలు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే ఈ మార్పులు తప్పనిసరి.. ప్రశాంతమైన వాతావరణం కోసం ఇవి చేయండి!

ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులుండాలి:మాజీ మంత్రి తలసాని

Select Suryaa Now
ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులుండాలి:మాజీ మంత్రి తలసాని
అమీర్‌పేట,మేజర్ న్యూస్:ప్రజలందరిపై అమ్మవారి చల్లని ఆశీస్సులుండాలని మాజీ మంత్రి,సనత్‌నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు.దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆయన గురువారం అమీర్‌పేట డివిజనులోని పలు ఆలయాలను దర్శించుకుని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ముందుగా కుమ్మరి బస్తీ లోని హనుమాన్ దేవాలయంలో బాలత్రిపుర సుందరిదేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకున్నారు.అనంతరం కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపించారు.తదనంతరం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు,వేదాశీర్వచనాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటున్నామని తెలిపారు.తొమ్మిది రోజుల పాటు భక్తులంతా అమ్మవారిని శ్రద్ధాసక్తులతో కొలుస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందిస్తున్నారని పేర్కొన్నారు.అమ్మవారి ఆశీస్సులతో ప్రజల్లో శాంతి, సామరస్య వెల్లివిరియాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి,ఈఓలు వినోద్ రెడ్డి,అంబుజ,జయంతి,ఆలయ చైర్మన్ లు సాయిబాబా గౌడ్,సత్యనారాయణ యాదవ్, మల్లిఖార్జున్,డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు హన్మంతరావు,నాయకులు అశోక్ యాదవ్,నామన సంతోష్ కుమార్,దాడి ప్రవీణ్ రెడ్డి,మధు,శ్రీనివాస్ గౌడ్,బాబా,వేణు గౌడ్,కూతురు నర్సింహ,ఆకుల రాజు,గుడిగే శ్రీనివాస్ యాదవ్,కట్టా బలరాం,గోపీలాల్ చౌహన్,వనం శ్రీనివాస్,హరిసింగ్,బాసా లక్ష్మీ,దుర్గ,రాణికౌర్ తదితరులు ఉన్నారు.