telanagana
నరేందర్ రెడ్డి ప్రథమ వర్ధంతిలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
దోమ, మేజర్ న్యూస్: దోమ మండల పరిధిలోని అనంతరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాజీ వీఆర్వో అనంతరెడ్డి కుమారుడు కీ.శే. నరేందర్ రెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమం గురువారం మల్లేపల్లి సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి హాజరై, కుటుంబ సభ్యులతో కలిసి నరేందర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ప్రజాప్రతినిధులు కొప్పుల నాగిరెడ్డి, మండల సర్పంచుల సంఘం మాజీ నేత కె. రాజిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులు నరేందర్ రెడ్డికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో దోమ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు గోపాల్ గౌడ్, మాజీ అధ్యక్షుడు హన్మంతు నాయక్, దామోదర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కొండారెడ్డి, ఆంజనేయులు, శశిధర్ రెడ్డి, సలీం, ఖాజా, నరేందర్ రెడ్డి, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: చాపల బద్రి, దోమ, వికారాబాద్ జిల్లా.