BREAKING
ఎన్నికల వేళ ఎక్సైజ్ శాఖ నిఘా: తనిఖీలు, పాత నేరస్తులకు హెచ్చరికలు. గురువారం సంతలో ఏ ఊరు వారైనా ఎవరైనా కొనుగోలు అమ్మకాలు చేయవచ్చు: సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ పంటలు ఎండుతున్నా పట్టించుకోరా..? లో వోల్టేజీతో రైతులకు తీవ్ర నష్టం మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నా స్పందన కరువు విద్యుత్ సబ్‌స్టేషన్ల వద్ద ధర్నాలకు దిగుతాం బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు ఎర్రోళ్ల రవి శివాలయం అవినీతి ఆరోపణలు నిరూపించండి నివాస ప్రాంతంలో అక్రమ గోల్డ్ రిఫైనరీ! దేశానికే ఆదర్శప్రాయుడు అబ్దుల్ కలాం -ఎమ్మెల్యే ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి :సబితా రెడ్డి వి.ఎస్.యూ.లో అబ్దుల్ కలాంకు ఘన నివాళి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలి స్థానిక ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల. కనీస వేతనాలు అమలు చేయాలి -కార్మికులకు రూ.42 వేల వేతనం ప్రకటించాలి -సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు పాశమైలారం -పారిశ్రామిక క్లస్టర్‌లో సీఐటీయూ పాదయాత్ర దర్శి మున్సిపల్ టిడిపి అభ్యర్థిగా దారం సుబ్బారావు. అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్‌ కొమరం భీమ్ విగ్రహావిష్కరణకు తరలిరావాలని పిలుపు.. ప్రచార రథాలు ప్రారంభం. మండలంలో జడ్పీ చైర్మన్ నాగలక్ష్మి విస్తృత పర్యటన.

అన్నదానం మహాదానం-యువ నాయకుడు నూకల అభినవ్ రెడ్డి

Select Suryaa Now
అన్నదానం మహాదానం-యువ నాయకుడు నూకల అభినవ్ రెడ్డి

మరిపెడ, మేజర్ న్యూస్, అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పదని జిల్లా కాంగ్రెస్ యువ నాయకుడు నూకల అభినవ్ రెడ్డి అన్నారు.మరిపెడ పట్టణంలోని శివాలయం మాన్యం ప్రాంగణంలో దసరా శరన్నవరాత్రుల సందర్బంగా ఏర్పాటు చేసిన  దుర్గా మాత మండపం వద్ద ఐదవ రోజు గురువారం పట్టణ యాదవ సంఘం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్బంగా అభినవ్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి,అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు.దుర్గామాత విగ్రహా ఏర్పాటుతో అంతటా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందన్నారు.అమ్మవారి దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.సామూహిక అన్నదానం వంటి కార్యక్రమాలతో ప్రజల మధ్య ఐకమత్యం పెంపొందుతుందని తెలిపారు. కార్యక్రమంలో  కౌన్సిలర్లు గంట్ల గౌతమ్ రెడ్డి, గంట్ల సుజాత మహిపాల్ రెడ్డి, జాటోతు సురేష్, సత్యవతి యుగంధర్, మెరుగు రాము, నీలా లచ్చిరాం, కాంతమ్మ కరణ్ సింగ్, కుడితి నరసింహ రెడ్డి, గుండగాని సుందర్, రేఖ రమేష్,ఉడుగుల రాజు పవన్ రెడ్డి,కాసారపు రమేష్,వేణు,భిక్షం, రేఖ దర్గయ్య తదితరులు పాల్గొన్నారు.
*శ్రీ లలితా దేవి అలంకరణలో అమ్మవారు
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు దుర్గామాత శ్రీ లలితా దేవీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు పాకాల రఘరామ్ శర్మ, అజయ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించారు.భవానీ దీక్షపరులు భజనలు చేయగా,భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందారు.

రిపోర్టర్, చంద్రశేఖర్, మరిపెడ, మహబూబాద్ జిల్లా.