నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కి వినతి
చిట్యాల, మేజర్ న్యూస్, చిట్యాల గ్రామ పంచాయతీ కి ఎంపీ ల్యాండ్స్ నిధుల నుంచి రూ. కోటి మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజ య్ కుమార్ కు బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. గురువారం కరీంనగర్లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ను బీజేపీ మండల అధ్యక్షుడు, చిట్యాల ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. చిట్యాల గ్రామ పంచాయతీ పరిధి లోని పలు ప్రాంతాల్లో సైడ్ డ్రైనేజీల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మురుగు నీటి పారుదలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అంతర్గత రహదారుల అభివృద్ధి లేక పోవడంతో గ్రామ ప్రజలు రాక పోకల్లో సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఈ వినతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సానుకూలంగా స్పందిస్తూ, జిల్లా కలెక్టర్తో మాట్లాడి నిధుల మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకునేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు బీజేపీ నాయకులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు రావుల రాకేష్, మైదం శ్రీకాంత్, కేంసారపు ప్రభాకర్, గుండ మణికుమార్, బుర్ర రాహుల్, బుర్ర రణధీర్, బుర్ర రితేష్, బుర్ర అరవింద్, బుర్ర కృష్ణ, బుర్ర అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్; సదానందం, చిట్యాల, భూపాలపల్లి జిల్లా