తణుకులో రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు శ్రీకారం -అండర్–17 విభాగంలో 300 మంది క్రీడాకారుల పోటీ
తణుకు, మేజర్ న్యూస్ : తణుకులో రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు గురువారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. చిట్టూరి సుబ్బారావు మెమోరియల్ ఆంధ్రప్రదేశ్ అండర్–17 బాలబాలికల బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్–2026లో భాగంగా క్వాలిఫికేషన్ మ్యాచ్లను టోర్నమెంట్ కమిటీ చైర్మన్ చిట్టూరి వెంకట కృష్ణారావు ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. క్వాలిఫికేషన్ మ్యాచ్లలో అర్హత సాధించిన క్రీడాకారులు శుక్రవారం నుంచి జరిగే మెయిన్ డ్రా పోటీల్లో తలపడనున్నట్లు టోర్నమెంట్ రిఫరీలు పి.రామకృష్ణయ్య, వి.నాగరాజు తెలిపారు.