సుందర పాలకొండ గా తీర్చిదిద్దుతా
పాలకొండ, సూర్య : పాలకొండ నగర పంచాయతీ ని సుందర పాలకొండ గా తీర్చిదిద్దుతామని పాలకొండ వైసీపీ చైర్మన్ అభ్యర్థి పాలవలస ఇందుమతి అన్నారు.గురువారం ఆమె స్వగృహం లో విలేకరుల తో మాట్లాడారు.ముందుగా తనపై నమ్మకం ఉంచి తనకు చైర్మన్ అభ్యర్థి ఇచ్చినందుకు వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పాలకొండ ఎంపీపీగా జడ్పిటిసి సభ్యురాలుగా పనిచేశానని తనకు పాలకొండపై పూర్తి అవగాహన ఉందని నగర పంచాయతీ Strip అభివృద్ధికి పూర్తిస్థాయిలో సమయం కేటాయించి అభివృద్ధి పార్టీలనిపిస్తానని హామీ సందర్భంగా తెలిపారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ పాలకొండ పట్టణ అభివృద్ధికి స్వర్గీయ పాలవలస రాజశేఖర్ సతీమణి తన తల్లి అయిన పాలవలస ఇందుమతి కి తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమం లో పాలకొండ మాజీ ఎమ్మెల్యే కళావతి, పట్టణ అధ్యక్షులు వెలమల మన్మధ రావు, పాలవలస దవాళేశ్వర రావు, దుప్పాడా పాపినాయుడు తదితరులు వున్నారు.
రిపోర్టర్ : రమణ మూర్తి నాయుడు, పాలకొండ, పార్వతీపురం మన్యం.