దుర్గామాతను దర్శించుకున్న మాజీ కార్పొరేటర్
గీసుగొండ , మేజర్ న్యూస్, గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్ ధర్మారం, కీర్తి నగర్, జాన్ పాక లలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారి మండపాలను స్థానిక మాజీ కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ సందర్శించి, అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామాలు మరియు కాలనీలు సుభిక్షంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
దుర్గామాత అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు.
రిపోర్టర్; విష్ణు చందర్, గీసుకొండ, హనుమకొండ జిల్లా,