BREAKING
రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం కెన్యాలో మూడో ఎబోలా కేసు నమోదు, అధికారుల అప్రమత్తత భైరంకొండలో సరస్వతి.. కోటకొండలో లక్ష్మీదేవి -- శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి ప్రత్యేక అలంకరణలు ప్రకాశం స్టేడియంలో ఘనంగా సింగరేణి బతుకమ్మ సంబరాలు, ఫ్యామిలీ డే కౌంటింగ్ రూమ్, స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన అధికారులు సరస్వతీ మాతగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు హిందూపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డి ఈ రమేష్ పేరు ఖరారు? లూలా ఖాతాలపై ఆంక్షల ఆరోపణలపై మెటా ఉద్యోగుల వెల్లడి ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు.. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిబంధనలు పాటించాలి వెల్దుర్తిలో ఆర్యవైశ్యులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించండి.... టెమ్యూ యాప్‌నకు భారీ ఊరట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జనసేన కార్యాలయంలో వేపకాయల బతుకమ్మ సందడి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్

తండ్రి మృతికి కారణమైన వ్యక్తికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష -- జరిమానా విధింపు

Select Suryaa Now
తండ్రి మృతికి కారణమైన వ్యక్తికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష    -- జరిమానా విధింపు

ఏలూరు, మేజర్ న్యూస్ : ఏలూరు జిల్లా ఎస్పీ  కె. ప్రతాప్ శివ కిషోర్ ప్రత్యేక ఆదేశాల మేరకు ఏర్పాటైన కోర్ట్ మానిటరింగ్ సెల్  సిబ్బంది. నేరస్థులకు సత్వర శిక్షలు పడేలా చేయడంలోనూ, బాధితులకు న్యాయం అందించడంతో తాజాగా గుడివాడ కోర్టులో ఒక కీలక కేసులో ముద్దాయికి కఠిన శిక్ష ఖరారైంది.

తీర్పు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.  కృష్ణా జిల్లా గుడివాడ 11వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఎం. కుమిదిని బుధవారం ఈ తీర్పు వెలువరించారు. ప్రస్తుత ఏలూరు డివిజన్ పరిధిలోని కలిదిండి పోలీస్ స్టేషన్ కు సంబంధించి. నేరం రుజువు కావడంతో ముద్దాయి కట్టా సత్యనారాయణకు న్యాయస్థానం కఠిన శిక్షలు ఖరారు చేసింది. ముద్దాయికి 5 సంవత్సరాల జైలు శిక్ష  రూ. 10 వేల రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షమూలో అదనంగా 2 నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. అలాగే మరో సెక్షన్ కింద 2 సంవత్సరాల సాధారణ జైలు శిక్షను విధిస్తూ, ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాలని ఆదేశించారు. ముద్దాయి చెల్లించే జరిమానా మొత్తంలో నుండి రూ. 9 వేలను బాధితురాలికి నష్టపరిహారంగా అందజేయాలని జడ్జి ఆదేశాలు జారీ చేశారు.కలిదిండి మండలం, గొల్లగూడెం గ్రామానికి చెందిన కట్టా సత్యనారాయణ ( ఏ-1) చెడు వ్యసనాలకు బానిసై, తన తండ్రి పక్షవాతంతో బాధపడుతున్నప్పటికీ వారి వద్ద ఉన్న 36 సెంట్లు భూమిని అమ్మి తనకు డబ్బులు ఇవ్వాలని నిత్యం వేధించేవాడు. అప్పటికే తన వాటాగా వచ్చిన 40 సెంట్లు భూమిని అమ్మి ఖర్చుపెట్టిన నిందితుడు, మరింత డబ్బు కోసం తండ్రిని చస్తావా లేకపోతే నన్ను చంపమంటావా అంటూ తీవ్రంగా బెదిరించడమే కాకుండా, ఇంట్లోని వస్తువులు, కరెంట్ మీటరును పగలగొట్టాడు. కొడుకు వేధింపులు భరించలేక, తీవ్ర మనోవేదనకు గురైన తండ్రి ఇంటి వరండాలో ఇనుప రాడ్డుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదిరాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి కలిదిండి ఎస్సై  వేముల వెంకట్వరరావు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించి చార్జిషీట్ దాఖలు చేశారు.అదనపు పీపీ కంబంపాటి రవి  ప్రాసిక్యూషన్ తరఫున గట్టి వాదనలు వినిపించి రాతపూర్వక వాదనలను  దాఖలు చేశారు.ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్  ఆదేశాలు, కైకలూరు రూరల్ సీఐ వి. రవి కుమార్  సూచనల మేరకు ప్రస్తుత కలిదిండి ఎస్సై ఎస్.ఎస్.ఎస్. పవన్ కుమార్, పి.ఎస్. సిబ్బంది హెచ్‌సీ ఎం. శ్రీనివాసరావు, పీసీ జి. చంద్రశేఖర్  సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరచడంలో కీలక పాత్ర పోషించారు.సిఎంసి సీఐ ఎం. సుబ్బా రావు పర్యవేక్షణలో  హెచ్‌సీ టి. రామాంజ నేయులు , హెచ్‌సీ ఎం. శ్రీనివాసరావు ప్రత్యేక శ్రద్ధ వహించి, సాక్షులను పీపీ  వద్దకు చేర్చడంలో  కేసు పర్యవేక్షణలో  సాక్ష్యాధారాలు  కోర్టు మానిటరింగ్ సెల్ సమన్వయము తో ముద్దాయి కి శిక్ష విధించారు.