BREAKING
తణుకులో రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు శ్రీకారం -అండర్‌–17 విభాగంలో 300 మంది క్రీడాకారుల పోటీ నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కి వినతి దుర్గామాతను దర్శించుకున్న మాజీ కార్పొరేటర్ నరేందర్ రెడ్డి ప్రథమ వర్ధంతిలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి రెబల్ స్టార్ అభిమానులకు షాక్.. ప్రభాస్ 'స్పిరిట్' మూవీ విడుదల వాయిదా? గెలుపే లక్ష్యంగా సమైక్యంగా పని చేయాలి వృద్ధురాలిని కుటుంబ సభ్యులకు అప్పగించిన శక్తి టీం సభ్యులు పేద మహిళలకు చీరల పంపిణీ పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్‌ కొండంత అండ:కాంగ్రెస్‌ దోమ మండల అధ్యక్షుడు శాంతు కుమార్‌ బాలి ప్రమాదం నుంచి కోలుకున్న నటి నుష్రత్ భరూచా.. విజయవంతంగా వెన్నెముక శస్త్రచికిత్స పూర్తి అన్నదానం మహాదానం-యువ నాయకుడు నూకల అభినవ్ రెడ్డి మాగుంట శ్రీనివాసరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఉలవ గోపి బిట్స్ కాలేజీలో డాక్టర్ అబ్దుల్ కలాం జయంతి వేడుకలు టాలీవుడ్‌కి కొత్త గ్లామర్ హంగులు.. ఒకేసారి పలకరించబోతున్న ఐదుగురు క్రేజీ హీరోయిన్స్ అగస్తీశ్వర స్వామి అన్నప్రసాద శాల నిర్మాణానికి 50 వేలు

ఆత్మకూరు మున్సిపాలిటీలో నేటి నుండి నామినేషన్ల స్వీకరణ

Select Suryaa Now
ఆత్మకూరు మున్సిపాలిటీలో నేటి నుండి నామినేషన్ల స్వీకరణ

ఆత్మకూరు,మేజర్ న్యూస్ :    ఆత్మకూరు మున్సిపాలిటీకి జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు శుక్రవారం నుండి నామినేషన్లు దాఖలు చేసేలా ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. బుధవారం నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.ఈనెల 16, 17, 18 తేదీల్లో అభ్యర్థులు నామినేషన్లు స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని ఎలక్షన్ ఆఫీసర్ కు దాఖలు చేయాల్సి ఉంది.నామినేషన్ల పరిశీలన ఈ నెల 19వ తేదీన జరగనుండగా ఈనెల 21వ తేదీన ఉపసంహరణల కార్యక్రమం ఉంటుంది. ఈనెల 28వ తేదీ పోలింగ్ జరగనుండగా ఈనెల 30వ తేదీ ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి జరుగుతుంది. అవసరమైతే రీపోలింగ్ ఈనెల 29వ తేదీన నిర్వహించేలా నిర్ణయించారు. మున్సిపల్ పరిధిలో 28 వార్డులు ఉండగా మొత్తం ఓటర్లు 26,529 మంది కాగా పురుష ఓటర్లు 12654 మంది, మహిళా ఓటర్లు 13,875 మంది ఉన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో స్థానిక మున్సిపల్ కమిషనర్ సి. గంగాప్రసాద్ పట్టణంలో ఎక్కడ ఫ్లెక్సీలు లేకుండా తొలగించడంతోపాటు విగ్రహాలకు కూడా ముసుగులు వేసి అన్ని చర్యలు చేపట్టారు.