అసెంబ్లీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులతో నాయకర్ సమావేశం
నరసాపురం, మేజర్ న్యూస్:స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 'అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ స్థానిక సంస్థల కో-ఆర్డినేషన్ కమిటీ' సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్, నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ నిర్వహించారు.
గురువారం జరిగిన ఈ కార్యక్రమం
సందర్భంగా కమిటీ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తూ పలు కీలక సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ, నరసాపురం నియోజకవర్గంలో కూటమిదే సంపూర్ణ విజయం కావాలని ఆయన స్పష్టం చేశారు.