ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు అందిస్తున్న ఉచిత కోచింగ్
సంగారెడ్డి : జోగిపేటలోని నెహ్రూ మెమోరియల్ డిగ్రీ కళాశాలలో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు అందిస్తున్న ఉచిత కోచింగ్ తరగతులను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్. సందర్శించారు.ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడిన జిల్లా ఎస్పీ, పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు క్రమశిక్షణతో చదవాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరంతర సాధనతో లక్ష్యాన్ని చేరుకోవచ్చని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించాలని అభ్యర్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్., జోగిపేట సీఐ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.