స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిదే పై చేయి.. రెడ్డప్ప రెడ్డి.
తంబళ్లపల్లె మండలం స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి ఇన్చార్జ్,మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ సహకారంతో టిడిపి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని మండల టిడిపి రెడ్డప్పరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి నాయుడు లు ధీమా వ్యక్తం చేశారు. గురువారం జి శంకర్ యాదవ్ ఆదేశాల మేరకు మల్లయ్య కొండ కింద జరిగిన కార్యకర్తల సమావేశంలో మండలంలో జరిగే ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహుల పేర్లను సేకరించారు. జడ్పిటిసి అభ్యర్థిగా వీరాంజనేయులు, ఎంపీపీ అభ్యర్థిగా సిద్ధమ్మ సింగల్ పేర్లు ఎంపీటీసీ అభ్యర్థులుగా పలువురు పోటీలు పడి పేర్లు నమోదు చేయించారు. ఈ విషయమై రెడ్డప్పరెడ్డి మాట్లాడుతూ ఆశావహుల పేర్లను మాజీఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ దృష్టికి తీసుకెళ్తామని అధిష్టానం తుది నిర్ణయం మేరకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు ఎంపిక అనంతరం విభేదాలు మరిచి కూటమి నాయకుల సహకారంతో మండలంలో ఎంపీపీ, జడ్పిటిసి, 11 ఎంపీటీసీలను కైవసం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో 21 పంచాయతీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పి గౌరీ శంకర్ స్టాప్ రిపోర్టర్ తంబళ్లపల్లె