కూరగాయలతో అన్నపూర్ణ దేవి అలంకరణ లో దర్శనం ఇచ్చిన మాతా పరమేశ్వరి
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు పట్టణంలోని అరుంధతీయపాలెం మాతమ్మ దేవాలయంలో గురువారం అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, ఆభరణాలతో అమ్మవారిని అలంకరించారు. వంకాయలు, టమాటాలు, ముల్లంగి, క్యారెట్, తోటకూర, కరివేపాకు, క్యాబేజీతో చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.