రైతులకు మందులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు..ఏవో స్రవంతి
ములకలచెరువు మండల కేంద్రంలోని పిటిఎం రోడ్డులో గల శ్రీ అన్నదాత ట్రేడర్స్ ఎరువులు, క్రిమి కీటక మందుల దుకాణంలో రైతులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో గురువారం మండల వ్యవసాయ అధికారి స్రవంతి దుకాణాన్ని, రికార్డులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ ఎరువులు క్రిమి కీటక మందుల దుకాణాలలో అధిక ధరలకు రైతులకు విక్రయిస్తే దుకాణం లైసెన్సు లు రద్దుచేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.ఎరువుల అమ్మకాల పట్ల, క్రిమికీటక మందులు విక్రయాలు,నిలువ గురించి పరిశీలించారు.ఇతర దుకాణాలలో కంటే అధిక ధరలకు ఎరువులు క్రిమి కీటక మందులు విక్రయాలు నిర్వహిస్తున్నట్లు రైతులు ఫిర్యాదులు చేస్తున్నారని, ఇకపై అలా జరిగితే చర్యలు తప్పవని, గతంలో కూడా సక్రమంగా దుకాణంలో నిర్వహించే ఎరువులు, క్రిమి కీటక మందుల వివరాలను సక్రమంగా చూపించలేదని, అధికారులు వస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దుకాణం యజమానిని హెచ్చరించారు.ఎరువులు పురుగుమందుల ధరల పట్టికలు దుకాణ యజమానులు వేయకపోవడం, ఎక్కువ ధరలకు ఎరువులు క్రిమి కీటక మందులు అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు, వీటిపై వ్యవసాయ అధికారులు సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు.ఆమె వెంట వ్యవసాయ శాఖ సిబ్బంది మరియు దుకాణదారులు ఉన్నారు.
పి గౌరీ శంకర్ స్టాప్ రిపోర్టర్ తంబళ్లపల్లె