BREAKING
అసెంబ్లీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులతో నాయకర్ సమావేశం 'కామ్రేడ్ కళ్యాణ్' భారీ విజయం సాధించడంతో తిరుమలకు శ్రీవిష్ణు.. శ్రీవారిని దర్శించుకున్న హీరో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిదే పై చేయి.. రెడ్డప్ప రెడ్డి. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు అందిస్తున్న ఉచిత కోచింగ్ బుచ్చిలో ఇద్దరు టిడిపి సీనియర్ల రాజీనామా విశ్వవిద్యాలయ వనరులతో... ఉపాధి సృష్టికర్తలగా ఎదగాలి ఆదిత్య యూనివర్సిటీ ఛాన్స్లర్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి వైసీపీ నెల్లూరు జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా బొమ్మిరెడ్డి తండ్రి మృతికి కారణమైన వ్యక్తికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష -- జరిమానా విధింపు కళ్యాణదుర్గం మున్సిపల్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దొడగట్ట హర్షిని ఖరారు కొత్త ఓఆర్ ఆర్ రైతులకు మందులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు..ఏవో స్రవంతి ఎమ్మెల్యేభూమా అఖిలప్రియ సమక్షంలో వైకాపా నుండి తెదేపాలో చేరిక మర్రిపాడులో రైతు మహిళా దినోత్సవం కూరగాయలతో అన్నపూర్ణ దేవి అలంకరణ లో దర్శనం ఇచ్చిన మాతా పరమేశ్వరి ఆత్మకూరు మున్సిపాలిటీలో నేటి నుండి నామినేషన్ల స్వీకరణ

హుస్నాబాద్‌ పురపాలక సంఘంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
హుస్నాబాద్‌ పురపాలక సంఘంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు

హుస్నాబాద్ : హుస్నాబాద్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి మంజుల పాల్గొన్నారు. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు.ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ అతిపెద్ద పండుగల్లో ఒకటని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రకృతిలో లభించే వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆడపడుచులందరూ ఒక్కచోట చేరి సంతోషాల మధ్య పండుగను జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమని అన్నారు.తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు బతుకమ్మ పండుగ నిదర్శనమని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో బతుకమ్మ సంబరాలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు ఇలాంటి వేడుకలు దోహదపడతాయని తెలిపారు.పూల పరిమళాలు, మహిళల ఆటపాటలు, బతుకమ్మ పాటలతో కార్యక్రమ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్ పర్సన్ దండి లక్ష్మి వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ కౌన్సిలర్లు మెప్మా ప్రతినిధులు ఐసిడిఎస్ సిబ్బంది వివోలు మహిళా సంఘాల ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులుపాల్గొన్నారు

శ్రీనివాస్ గౌడ్ హుస్నాబాద్ మండల రిపోర్టర్…