BREAKING
రూ.2 లక్షల ఎల్‌ఓసీ అందించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎల్లంపేట్ మున్సిపాలిటీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నాగుల ఆనంద్ యాదవ్ బాసర మూల నక్షత్రం వేడుకలకు 200 మంది పోలీసులతో పటిష్ట భద్రత జొన్నవాడలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన కామాక్షి తాయి బైండోవర్ 27 ఏళ్ల వివాహ బంధం.. అరుదైన ఫొటోలతో మాధురి దీక్షిత్ దంపతుల వెడ్డింగ్ యానివర్సరీ వేడుక! పరిగి లో వైభవంగా బతుకమ్మ వేడుకలు రవీందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పైలెట్ రోహిత్ రెడ్డి 'రణబాలి' చిత్రంలో జయమ్మగా యాంకర్ సుమ.. వైరల్ అవుతున్న ప్రత్యేక లుక్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన... మిరియాల రాఘవరావు,మిరియాల ప్రీతమ్ చిన్ననాటి ఫొటోలో అందాల క్యూట్ పాప ఎవరో గుర్తుపట్టారా?.. ఇప్పుడు టాలీవుడ్‌ను ఏలుతున్న స్టార్ హీరోయిన్! బైండోవర్ కేసులు నమోదు చేస్తాం...ఎస్సై..! దేవి మండపాలను దర్శించిన కాంగ్రెస్ నేత ఉపేందర్ రెడ్డి న్యూయార్క్ నియంత్రణ సంస్థకు 33 మిలియన్ డాలర్లు చెల్లించిన ఎస్ఈబీ (SEB) బ్యాంక్

కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. పాల్గొన్న కలెక్టర్ దీపక్ తివారి

Select Suryaa Now
కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. పాల్గొన్న కలెక్టర్ దీపక్ తివారి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ : వికారాబాద్ జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) ఆవరణలో గురువారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దీపక్ తివారి గౌరీమాతకు పూజలు నిర్వహించి, మహిళా ఉద్యోగులు, మహిళా సంఘాల సభ్యులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. డీఆర్‌డీఏ, ఉద్యానవన శాఖ, డీపీఆర్ఓ శాఖల ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా జరిగాయి.ఈ సందర్భంగా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. బతుకమ్మ నవరాత్రి ఉత్సవాలతో పాటు దసరా పండుగ విశిష్టతను కూడా పిల్లలకు వివరించి, మన ఆచార వ్యవహారాలను వారికి నేర్పించాలని సూచించారు.ప్రభుత్వ విధులు నిర్వహించడంతో పాటు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందదాయకమని కలెక్టర్ అన్నారు. ఇటువంటి వేడుకలు ఉద్యోగుల మధ్య స్నేహభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ వాటి గొప్పతనాన్ని రాబోయే తరాలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు.వేడుకల్లో భాగంగా అందంగా అలంకరించిన బతుకమ్మలను ఎంపిక చేసి, ఉత్తమ బతుకమ్మల నిర్వాహకులకు బహుమతులు అందజేశారు. మహిళా ఉద్యోగులు, మహిళా సంఘాల సభ్యులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బతుకమ్మ పాటలతో సందడి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటాచారి, ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుటుర్, డీఆర్‌డీఏ అధికారులు శ్రీనివాస్, సత్తార్, డీపీఓ జయసుధ, డీపీఆర్ఓ చెన్నమ్మ, సుధాకర్ లాల్, నర్సింహులు, ఏఓ ఫర్వీహీన్ బేగం, కలెక్టరేట్‌లోని వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.