BREAKING
ప్రకాశం స్టేడియంలో ఘనంగా సింగరేణి బతుకమ్మ సంబరాలు, ఫ్యామిలీ డే కౌంటింగ్ రూమ్, స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన అధికారులు సరస్వతీ మాతగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు హిందూపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డి ఈ రమేష్ పేరు ఖరారు? లూలా ఖాతాలపై ఆంక్షల ఆరోపణలపై మెటా ఉద్యోగుల వెల్లడి ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు.. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిబంధనలు పాటించాలి వెల్దుర్తిలో ఆర్యవైశ్యులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించండి.... టెమ్యూ యాప్‌నకు భారీ ఊరట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జనసేన కార్యాలయంలో వేపకాయల బతుకమ్మ సందడి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ టెలికాం దిగ్గజాలకు ప్రత్యామ్నాయం కాలేని స్పేస్‌ఎక్స్ ఆపదలో రక్తదానం.. ప్రాణదాతకు అభినందనల వెల్లువ! 48 గంటల్లోనే నిందితులను అరెస్ట్ అర్బన్ సీఐ ఆర్ఎస్ కిషోర్ కుమార్ ఎస్సై బి జగన్మోహన్ రావును అభినందించిన ఎస్పీ వకుల్ జిందాల్

కలెక్టరేట్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
కలెక్టరేట్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

మహబూబ్ నగర్, సూర్య ప్రతినిధి:మహబూబ్‌నగర్ కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఈరోజు  బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్త పూజ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎక్సైజ్, నీటిపారుదల, రిజిస్ట్రేషన్,  వ్యవసాయ శాఖ, జిల్లా సహకార శాఖ, పి.డి ఆత్మ , షెడ్యూల్ కులాల సంక్షేమ అభివృద్ధి, శాఖలకు చెందిన మహిళా ఉద్యోగినులు సంప్రదాయబద్ధంగా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి వేడుకల్లో పాల్గొన్నారు.
బతుకమ్మల చుట్టూ చేరి ఆటపాటలతో సందడి చేస్తూ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళా ఉద్యోగినులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటూ పండుగ ప్రత్యేకతను చాటిచెప్పారు.

కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. ఎల్. బి హరిప్రియ, అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ సాయి శివాని, డి.ఆర్.ఓ నిర్మల,జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారిని సునీత ,జిల్లా అధికారులు
తదితరులు పాల్గొన్నారు.