BREAKING
రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం కెన్యాలో మూడో ఎబోలా కేసు నమోదు, అధికారుల అప్రమత్తత భైరంకొండలో సరస్వతి.. కోటకొండలో లక్ష్మీదేవి -- శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి ప్రత్యేక అలంకరణలు ప్రకాశం స్టేడియంలో ఘనంగా సింగరేణి బతుకమ్మ సంబరాలు, ఫ్యామిలీ డే కౌంటింగ్ రూమ్, స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన అధికారులు సరస్వతీ మాతగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు హిందూపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డి ఈ రమేష్ పేరు ఖరారు? లూలా ఖాతాలపై ఆంక్షల ఆరోపణలపై మెటా ఉద్యోగుల వెల్లడి ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు.. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిబంధనలు పాటించాలి వెల్దుర్తిలో ఆర్యవైశ్యులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించండి.... టెమ్యూ యాప్‌నకు భారీ ఊరట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జనసేన కార్యాలయంలో వేపకాయల బతుకమ్మ సందడి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్

*మధిర HP Gas agency లో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం*

Select Suryaa Now
*మధిర   HP Gas agency లో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం*

మధిర, సూర్య మేజర్ న్యూస్.సమాజంలో, సంస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడంతో పాటు అవినీతి నిర్మూలనపై అవగాహన కల్పించే లక్ష్యంతో విజిలెన్స్ అవగాహన కార్యక్రమాన్ని మధిరలోని శ్రీ సాయి వెంకటేశ్వర హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీలో గురువారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ జనరల్ మేనేజర్ (విజిలెన్స్) మరే సునీల్ కుమార్, విజయవాడ డిప్యూటీ మేనేజర్ కే. శ్రీనివాస్, మార్కెటింగ్ మేనేజర్ రాహుల్, ఖమ్మం సేల్స్ ఆఫీసర్ జక్కం పవన్ నరేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన గ్యాస్ పంపిణీదారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సంస్థల అభివృద్ధికి, ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించేందుకు విజిలెన్స్ అవగాహన ఎంతో కీలకమని పేర్కొన్నారు. అవినీతి, లంచగొండితనానికి దూరంగా ఉంటూ నిజాయితీతో విధులు నిర్వహించాలని సూచించారు. అవినీతి రహిత వాతావరణం ఏర్పడటానికి ఉద్యోగులతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని తెలిపారు. భాగస్వాములైన వారందరితో నైతిక విలువలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అదేవిధంగా మధిర హెచ్.పీ గ్యాస్ యాజమాన్యం ప్రజలకు అందించే సేవలను గుర్తించి అభినందించారు.  ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, సేల్స్ విభాగం సిబ్బంది, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు