ప్రజా సంక్షేమమే ధ్యేయం.. సరికొత్త రాజకీయ వేదికగా 'పి.ఆర్.కే. పార్టీ' ఆవిర్భావం!
యాదగిరిగుట్ట మేజర్ న్యూస్.…పి.ఆర్.కే. అంటే మీ అందరికీ కొత్తగా పరిచయం అక్కర్లేదు.. గత 2018 నుంచి మా సేవలు ప్రజలందరికీ తెలిసినవే" అంటూ పి.ఆర్.కే. పార్టీ అధినేత, అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ (పి.ఆర్.కే.) తన రాజకీయ ప్రయాణం వెనుక ఉన్న ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 6వ తేదీన హైదరాబాద్లో భారీ పాదయాత్రతో అధికారికంగా 'పి.ఆర్.కే.' (ప్రోగ్రెసివ్ రిఫార్మ్ నాలెడ్జ్) రాజకీయ పార్టీని లాంచ్ చేసినట్లు ఆయన ప్రకటించారు. తొమ్మిదేళ్లుగా ఎలాంటి స్వార్థం లేకుండా, తన తల్లిదండ్రుల స్మరణార్థం అందిస్తున్న సేవా కార్యక్రమాలను ఇకపై మరింత విస్తృత స్థాయిలోకి తీసుకెళ్లేందుకే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన వెల్లడించారు.ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వేలాది మందికి గత తొమ్మిది సంవత్సరాలుగా 'అన్నం కార్డ్స్' అందిస్తున్నారు. కందిపల్లి, ఈసీఐఎల్, అమీన్పూర్, అంబర్పేట్, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో ప్రతి నెలా 10వ తేదీన నిరుపేదలకు బియ్యం, పిండి, రవ్వ, చక్కర వంటి నిత్యావసర సస్తువులతో పాటు వారి వైద్య ఖర్చులను కూడా స్వయంగా భరిస్తున్నారు.హాస్పిటల్స్కు వెళ్లే పేదలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో 'పి.ఆర్.కే. హెల్త్ కార్డ్స్ విడుదల చేశారు. అంబర్పేట్, అమీన్పూర్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో మహేశ్వరం మెడికల్ కాలేజీ సహకారంతో సుమారు 50 మంది వైద్యులను రప్పించి, 1,800 మందికి పైగా మెగా వైద్య శిబిరాల ద్వారా ఉచిత వైద్యం అందించారు.ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆడపిల్లల పెళ్లిళ్లు చేయలేకపోతున్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచారు. కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాలకు చెందిన ఎంతోమంది నిరుపేద యువతుల వివాహాలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఇప్పటివరకు సుమారు 3,700 మందికి పైగా ప్రత్యక్షంగా ఆపద్బాంధవుడిగా నిలిచారు. వ్యక్తిగతంగా ఎంత సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ, వాటికి కొన్ని ఆర్థిక, వ్యవస్థాపక పరిమితులు ఉంటాయని ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా లేదా రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది మందికి సేవలు అందించాలంటే ప్రభుత్వ అధికారం లేదా ఒక రాజకీయ శక్తి అవసరమని ప్రజల నుంచి వచ్చిన సూచన మేరకే పార్టీని స్థాపించినట్లు తెలిపారు. మీ కోసం పుట్టిన మీ పార్టీ అని ఆయన స్పష్టం చేశారు. యాదాద్రి నుంచి రాష్ట్రవ్యాప్త విస్తరణ
యాదాద్రి జిల్లాలోని నర్సప్ప తమ సొంతూరు అని, చిన్నప్పటి నుంచి అక్కడి అనుబంధం కారణంగా అక్కడి నుంచే పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రవీణ్ కుమార్ తెలిపారు. అన్ని జిల్లాల నుంచి అనుమతులు పొందిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలను విస్తరిస్తామన్నారు. రాష్ట్రంలో మంచి నైపుణ్యం ఉండి కూడా రాజకీయాలకు దూరంగా ఉంటున్న యువత, మహిళలు, ప్రతిభావంతులు ఎవరైనా సరే తమ పార్టీ ద్వారా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.పి.ఆర్.కే. పార్టీ ప్రవీణ్ కుమార్ (పి.ఆర్.కే)
గత తొమ్మిదేళ్లుగా ఏ విధంగా అయితే తమ సేవా కార్యక్రమాలను ఆదరించి సహకరించారో, అదే విధంగా ఈ రాజకీయ ప్రయాణంలోనూ ప్రజలందరి సంపూర్ణ సహకారం అందించాలని ఆయన కోరారు.