BREAKING
సెబీ నూతన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ఫ్రేమ్‌వర్క్: సవరించిన ట్రేడింగ్ వేళలు, వీడబ్ల్యూఏపీ నిబంధనలు, డెరివేటివ్స్ కటాఫ్ వివరాలివే! సౌదీ అరేబియా విమాన సర్వీసులపై భారత ఎంబసీ కీలక ప్రకటన: రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా విమానాలు అక్టోబర్ 24 వరకు రద్దు! నేటి రాశి ఫలాలు – 16 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 16 అక్టోబర్ 2026 ప్రైవేట్ మూలధన సమీకరణ, ఉద్యోగాల కల్పనపై ప్రపంచ బ్యాంక్ దృష్టి సారించాలి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం! మెహ్లీ మిస్త్రీకి అభ్యంతరాలు వ్యక్తం చేసే చట్టబద్ధమైన అర్హత లేదు: టాటా ట్రస్ట్స్ తీవ్ర అభ్యంతరం.. వివాదంలో కీలక మలుపు! సౌదీ అరేబియాలో భారత పౌరులకు కీలక సూచన: గగనతల దాడుల ముప్పు వేళ ఇళ్లలోనే ఉండాలని ఎంబసీ తాజా మార్గదర్శకాలు! అమెరికాలో హిందూ దేవాలయంపై భారీ కాల్పుల కుట్ర భగ్నం: 19 ఏళ్ల శ్వేతజాతి దురహంకారి అరెస్ట్. ఆర్సీహెచ్‌పీలో ఘనంగా శరన్నవరాత్రి పూజ నేపాల్‌లో భారత పెట్టుబడులను మరింత విస్తరించండి: భారతీయ పారిశ్రామికవేత్తలకు నేపాల్ ఆర్థిక మంత్రి ఖనాల్ పిలుపు.. వంగపల్లి గ్రామ యువకుడి హత్య...... కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం లక్క పల్లి లో భూ సర్వేలపై గ్రామసభ ఐసీసీ నిబంధనల ఉల్లంఘన.. ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ అఫ్సర్‌పై అధికారిక మందలింపు! గణేష్ నిమజ్జన సేవలకు గుర్తింపు సీపీ చేతుల మీదుగా భాను ప్రకాశ్‌కు సన్మానం

కెల్లెడులో నయనానందకరంగా ‘లలితా దీపోత్సవం’

Select Suryaa Now
కెల్లెడులో నయనానందకరంగా ‘లలితా దీపోత్సవం’

సూర్య - మానకొండూర్, మండలంలోని కెల్లెడు గ్రామంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు గురువారం రాత్రి గ్రామంలో నిర్వహించిన "లలితా దీపోత్సవం" కార్యక్రమం కన్నులపండువగా సాగింది. గ్రామ సర్పంచ్ ఆడెపు రజిత-విజయ్ ఆధ్వర్యంలో గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ దివ్య దీపారాధన మహోత్సవంలో పాలుపంచుకున్నారు.
నవరాత్రుల్లో ఐదవ రోజున సకల సౌభాగ్య ప్రదాయిని అయిన శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని పూజించడం సంప్రదాయం. ఈ సందర్భంగా మహిళలు తమ స్వహస్తాలతో బియ్యపు పిండి, నువ్వుల నూనెతో పవిత్రమైన పిండి ప్రమిదలను సిద్ధం చేశారు. వీటన్నింటినీ అమ్మవారి ముందట చేర్చి, ఏకకాలంలో ఒకే పెద్ద హోమ రూపంలో వెలిగించారు. ఈ విధంగా పిండి దీపాలను హోమ స్వరూపంలో వీక్షించడం వల్ల జాతకంలోని గ్రహ దోషాలు, పీడలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు నశించి, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల మనోవాంఛలు సిద్ధిస్తాయని వేద పండితులు తెలిపారు. మహిళలు భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించడంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో మెరిసిపోయింది. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.