BREAKING
సెబీ నూతన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ఫ్రేమ్‌వర్క్: సవరించిన ట్రేడింగ్ వేళలు, వీడబ్ల్యూఏపీ నిబంధనలు, డెరివేటివ్స్ కటాఫ్ వివరాలివే! సౌదీ అరేబియా విమాన సర్వీసులపై భారత ఎంబసీ కీలక ప్రకటన: రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా విమానాలు అక్టోబర్ 24 వరకు రద్దు! నేటి రాశి ఫలాలు – 16 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 16 అక్టోబర్ 2026 ప్రైవేట్ మూలధన సమీకరణ, ఉద్యోగాల కల్పనపై ప్రపంచ బ్యాంక్ దృష్టి సారించాలి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం! మెహ్లీ మిస్త్రీకి అభ్యంతరాలు వ్యక్తం చేసే చట్టబద్ధమైన అర్హత లేదు: టాటా ట్రస్ట్స్ తీవ్ర అభ్యంతరం.. వివాదంలో కీలక మలుపు! సౌదీ అరేబియాలో భారత పౌరులకు కీలక సూచన: గగనతల దాడుల ముప్పు వేళ ఇళ్లలోనే ఉండాలని ఎంబసీ తాజా మార్గదర్శకాలు! అమెరికాలో హిందూ దేవాలయంపై భారీ కాల్పుల కుట్ర భగ్నం: 19 ఏళ్ల శ్వేతజాతి దురహంకారి అరెస్ట్. ఆర్సీహెచ్‌పీలో ఘనంగా శరన్నవరాత్రి పూజ నేపాల్‌లో భారత పెట్టుబడులను మరింత విస్తరించండి: భారతీయ పారిశ్రామికవేత్తలకు నేపాల్ ఆర్థిక మంత్రి ఖనాల్ పిలుపు.. వంగపల్లి గ్రామ యువకుడి హత్య...... కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం లక్క పల్లి లో భూ సర్వేలపై గ్రామసభ ఐసీసీ నిబంధనల ఉల్లంఘన.. ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ అఫ్సర్‌పై అధికారిక మందలింపు! గణేష్ నిమజ్జన సేవలకు గుర్తింపు సీపీ చేతుల మీదుగా భాను ప్రకాశ్‌కు సన్మానం

ఏడుపాయల్లో వైభవంగా బోనాల ఉత్సవాలు

Select Suryaa Now
ఏడుపాయల్లో వైభవంగా బోనాల ఉత్సవాలు

పాపన్నపేట :  రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత చెంత గురువారం బోనాల జోరు హోరెత్తింది. వన దుర్గమ్మ ఆలయం చెంత ఉన్న గోకుల్ షెడ్ లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన గురువారం వనదుర్గమ్మను మహాలక్ష్మి దేవి రూపంలో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.
అనంతరం గోకుల్ షెడ్ లో ప్రతిష్టించిన ఉత్సవ విగ్రహం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. బోనాలను డప్పు చప్పుళ్ళు.. మేళ తాళాల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి వనదుర్గమ్మకు సమర్పించారు. భక్తుల జయ జయ ద్వానాల మధ్య ఏడుపాయల వన దుర్గమ్మ క్షేత్రం హోరెత్తింది. వనదుర్గమ్మ తల్లి.. చల్లంగా చూడమ్మా అంటూ భక్తులు వేడుకున్నారు.

భక్తిశ్రద్ధలతో బోనాల సమర్పణ

మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, గొంగిడి సునీత, తుల ఉమ ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. బోనాల సమర్పణతో సంప్రదాయ భక్తి వైభవం ఉట్టిపడింది.

అలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు..

గోకుల్ షెడ్ లో నిర్వహిస్తున్న ఉత్సవాల ప్రాంగణంలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయ అమ్మవారి కళారూపాలు, చిన్నారుల ప్రతిభాపాటవాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల ప్రదర్శనలను భక్తులు ఆసక్తిగా తిలకించి అభినందించారు.

భక్తి.. సంప్రదాయం.. ఆధ్యాత్మిక వైభవం!

అమ్మవారి దర్శనం, బోనాల సమర్పణలు, భక్తుల పూజలు, చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలతో ఏడుపాయల క్షేత్రం ఆధ్యాత్మిక కళను సంతరించుకుంది. భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న వనదుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి వీరేశం సిబ్బంది సూర్య శ్రీనివాస్ ,మధుసూదన్ రెడ్డి, ప్రతాపరెడ్డి, శ్రీనివాస్ శర్మ ,బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు