చిన్న పిల్లల దసరా వేడుకలు.. చిన్ననాటి జ్ఞాపకాల గుర్తు చేసుకున్న కలెక్టర్
శ్రీకాకుళం, సూర్య : జిల్లా కలెక్టరేట్ వద్ద జెబిటి పాఠశాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన చిన్నారుల దసరా వేడుకలు ఆకట్టుకున్నాయి. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చిన్నారులతో కలిసి సందడి చేసి, తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో చిన్నారులు పాడిన "ఏదయ్యా... మీ దయ మామీద లేదయ్యా" పాటకు కలెక్టర్ ఫిదా అయ్యారు. వారి ప్రతిభకు, అమాయకత్వానికి కలెక్టర్ ముచ్చట పడ్డారు. చిన్నారులు అందజేసిన పూల విల్లును చూసి ఆయన మురిసిపోయారు. అలనాటి సంస్కృతిని పరిరక్షించేందుకు పాఠశాల యాజమాన్యం చేస్తున్న కృషిని కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు.
రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.