విద్యుత్ కోతలపై ప్రజలకు సమాధానం చెప్పాలి..
సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్ :తెలంగాణలో కరెంట్ కోతలపై ప్రజలు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారని, దీనిపై ప్రభుత్వం స్పష్టతనిచ్చి విద్యుత్ సమస్యలను క్షేత్రస్థాయిలో వెంటనే పరిష్కరించాలని బీజేపీ ఎంపీ రఘునందన్రావు డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన పాలకులు, ఇప్పుడు ఎస్ఐఆర్ (SIR) పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
కొండారెడ్డిపల్లిలో ఎన్ని ఓట్లు తొలగించారో స్పష్టంగా చెప్పాలని సవాల్ విసిరిన ఆయన.. ఎస్ఐఆర్ ప్రక్రియలో కేవలం డూప్లికేట్, మరణించిన వారి ఓట్లను మాత్రమే తొలగించార స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో నెలకొన్న కరెంట్ కోతలు, ఓటర్ల జాబితా సవరణ వివాదంపై ఎంపీ రఘునందన్రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.