ఘనంగా సాయి దత్తాత్రేయ స్వామి 108వ ఆరాధనోత్సవాలు
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: మండల కేంద్రమైన భట్టిప్రోలు లో వేంచేసి యున్న శ్రీ షిర్డీ సాయి దత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో 108వ ఆరాధనోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు.ఇందులో భాగంగా ఉదయం స్వామి వారికి క్షీరాభిషేకం నిర్వహించి, అనంతరం సహస్రనామార్చన చేశారు. భక్తుల భక్తి శ్రద్ధల నడుమ, వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
పాల్గొన్న దంపతులు:
స్వామివారి అభిషేక పూజా కార్యక్రమాల్లో తిరువీధుల బాలాజీ-ఉదయ భాస్కరి, ఆలపాటి సురేంద్ర-ఉషారాణి, పట్టంశెట్టి భాస్కరరావు - భద్రకాళి, కౌతరపు చంద్రశేఖర శర్మ-జయలక్ష్మి, జాలాది నాగరామకోటయ్య-బాలా త్రిపుర సుందరి, మద్దుల రాంబోట్లు-నగరాజకుమారి దంపతులు పాల్గొని స్వామి వారికి పూజలు నిర్వహించారు. కార్యక్రమాలను దేవస్థాన అధ్యక్షులు తమ్మన రమేష్ బాబు, కోశాధికారి బూరెల కిరణ్ కుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి జవ్వాది వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు చెన్నగిరి పాపారావు, బట్టు రమేష్ బాబు, ఉత్సవ కమిటీ నిర్వహణ సభ్యులు తటవర్తి అర్ధనారీశ్వరుడు, చందలూరి శివప్రసాద్ తదితరులు పర్యవేక్షించారు.