BREAKING
అసెంబ్లీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులతో నాయకర్ సమావేశం 'కామ్రేడ్ కళ్యాణ్' భారీ విజయం సాధించడంతో తిరుమలకు శ్రీవిష్ణు.. శ్రీవారిని దర్శించుకున్న హీరో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిదే పై చేయి.. రెడ్డప్ప రెడ్డి. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు అందిస్తున్న ఉచిత కోచింగ్ బుచ్చిలో ఇద్దరు టిడిపి సీనియర్ల రాజీనామా విశ్వవిద్యాలయ వనరులతో... ఉపాధి సృష్టికర్తలగా ఎదగాలి ఆదిత్య యూనివర్సిటీ ఛాన్స్లర్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి వైసీపీ నెల్లూరు జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా బొమ్మిరెడ్డి తండ్రి మృతికి కారణమైన వ్యక్తికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష -- జరిమానా విధింపు కళ్యాణదుర్గం మున్సిపల్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దొడగట్ట హర్షిని ఖరారు కొత్త ఓఆర్ ఆర్ రైతులకు మందులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు..ఏవో స్రవంతి ఎమ్మెల్యేభూమా అఖిలప్రియ సమక్షంలో వైకాపా నుండి తెదేపాలో చేరిక మర్రిపాడులో రైతు మహిళా దినోత్సవం కూరగాయలతో అన్నపూర్ణ దేవి అలంకరణ లో దర్శనం ఇచ్చిన మాతా పరమేశ్వరి ఆత్మకూరు మున్సిపాలిటీలో నేటి నుండి నామినేషన్ల స్వీకరణ

అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

Select Suryaa Now
అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

గూడూరు, మేజర్ న్యూస్, గురువారం రోజున కీర్తిశేషులు మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం  జయంతిని గూడూరు మండలంలోని వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  వాకింగ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అబ్దుల్ కలాం గారి చిత్రపటానికి పూలమాలలు వేసి వాకర్ సభ్యులందరూ ఘనంగా నివాళులర్పించారు. జాతికి ఆదర్శప్రాయమైన ఆయన జీవిత చరిత్రను నెమరు వేసుకున్నారు. అబ్దుల్ కలాం అమర్ రహే అంటూ నినదించారు. ఇదిలా ఉండగా గ్రౌండ్ లో వాకర్స్ సభ్యులతో పాటు నిత్యం వాకింగ్ చేస్తూ అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్న వయోవృద్ధురాలు సరోజన గారిని పూల బొకేతో, శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ముక్తవరం సత్యనారాయణ, ఉపాధ్యక్షులు మండల వెంకటేశ్వర్లు, కార్యదర్శి నూనావత్ వీరన్న, గౌరవ సలహాదారులు సంగేపు స్వామి కన్నా వెంకటేశ్వర్లు, ఐలబోయిన వీరయ్య, బుర్రి కొమురయ్య, బట్టు సారయ్యలతో పాటు సభ్యులు దోని యాదగిరి, సయ్యద్ కరీం, మడిపెద్ది భాస్కర్, వడ్డోజు రాజలింగాచారి, మచ్చిక మొగిలి, మండల మల్లేష్, అమృ, బాలు, నాను, బుర్క సత్యం, ఈసం కృష్ణమూర్తి, వల్లపు శ్రీనివాస్, ఊట్ల రాజేష్, సంగెపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం యాత్రకై వెళ్లిన వాకర్స్ అసోసియేషన్ మిత్రులు గురువారం రామేశ్వరంలోని అబ్దుల్ కలాం గారి ఇంటి వద్ద ఆయన జయంతి వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో అధ్యక్షులు ముయ్యబోయిన వెంకన్న, ఉపాధ్యక్షులు ఊకె లక్ష్మయ్య, కోశాధికారి బత్తుల శ్రీనివాస్, కార్యదర్శి పెనుక ప్రభాకర్, బీరం వెంకట్ రెడ్డి, గజ్జి మల్లయ్య, బెజ్జం రమేష్, సంగేపు బాబు, బోడ ఎల్లయ్య, బత్తుల లక్ష్మణ్, దబ్బగట్ల రమేష్, మంగీలాల్  తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్, యాకుబ్ పాషా ,గూడూరు, మహబూబాబాద్ జిల్లా