సుధారాణి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం
విజయనగరం, సూర్య : సుధారాణి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ కార్యదర్శి ఎంపి ఉపేంద్ర జన్మదినం సందర్భంగా పట్టణంలో గల బృందావనం అపార్ట్మెంట్స్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు ఎం పి గౌరీశ్వరరావు మాట్లాడుతూ తన కుమారుడు ఎం పి ఉపేంద్ర జన్మదినం సందర్భంగా పట్టణంలో ఉన్న నిరుపేదల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. తన ట్రస్ట్ ద్వారా పుట్టినరోజు, పెళ్లి రోజులే కాకుండా వివిధ సమయాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నమన్నారు. ఇప్పటికే పట్టణంలో అనేకమందికి ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, రానున్న కాలంలో సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ఆధ్వర్యంలో విస్తృతంగా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కోశాధికారి ఎం పి శిరీష తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : డేవిడ్ రాజు, విజయనగరం.