BREAKING
సొంత నిధులతో ఆడపడుచులకు బతుకమ్మ కానుక.. సర్పంచ్ రాజు ఔదార్య వంగర ఎస్ఐ గా మెరుగు రాజు బాధ్యతల స్వీకరణ విద్యుత్ కోతలపై ప్రజలకు సమాధానం చెప్పాలి.. నడకే దివ్య ఔషధం.. ఆరోగ్యానికి ఆయువుపట్టు.... ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ సూర శ్రీనివాసరావు చిన్న పిల్లల దసరా వేడుకలు.. చిన్ననాటి జ్ఞాపకాల గుర్తు చేసుకున్న కలెక్టర్ అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు పలాస, ఇచ్ఛాపురం మునిసిపల్ ఎన్నికల నిర్వహణపై ఫేజ్–1 శిక్షణ సమావేశం వికారాబాద్ నియోజకవర్గానికి రూ.5.90 కోట్ల నిధులు.. మూడు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి జీవోలు జారీ 'మిస్టర్ ఇండియా' పోటీల్లో సత్తా చాటిన ధిల్లేశ్వరరావు.... ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే గొండు శంకర్ దుర్గామాతను దర్శించుకున్న మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి నంగునూరు ఉద్యోగుల సంక్షేమ సంస్థ నూతన కార్యవర్గం మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన పాలకొండ సబ్-కలెక్టర్ డైరెక్టర్ల ఎన్నిక ఏకగ్రీవం హుస్నాబాద్‌ పురపాలక సంఘంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు

గారకుర్తిలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం!

Select Suryaa Now
గారకుర్తిలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం!

కొండాపూర్ ; మండల పరిధిలోని గారకుర్తి గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గ్రామంలోకి ప్రవేశించగానే ప్రధాన రహదారికి ఇరువైపులా చెత్త, గడ్డి, పిచ్చి మొక్కలు రోడ్డు పక్కన ఏపుగా పెరగడంతో పాటు డ్రైనేజీ నీరు సక్రమంగా వెళ్లేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.గ్రామ పంచాయతీ కార్యాలయం చుట్టుపక్కల  గడ్డి, పిచ్చి మొక్కలు పెరిగి పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. మరోవైపు గ్రామ ప్రజలకు ఉపయోగపడాల్సిన పంచాయతీ వాటర్ ట్యాంకర్ నిరుపయోగంగా మూలనపడి కనిపిస్తోంది. ప్రజా అవసరాలకు ఉపయోగపడాల్సిన పరికరాలు నిరుపయోగంగా ఉండటంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టి రహదారులకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని, డ్రైనేజీలను శుభ్రం చేసి నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. పంచాయతీ కార్యదర్శి, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతో పాటు నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంకర్‌ను వినియోగంలోకి తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

రాజు కొండాపూర్ మండల్ రిపోర్టర్…