BREAKING
సొంత నిధులతో ఆడపడుచులకు బతుకమ్మ కానుక.. సర్పంచ్ రాజు ఔదార్య వంగర ఎస్ఐ గా మెరుగు రాజు బాధ్యతల స్వీకరణ విద్యుత్ కోతలపై ప్రజలకు సమాధానం చెప్పాలి.. నడకే దివ్య ఔషధం.. ఆరోగ్యానికి ఆయువుపట్టు.... ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ సూర శ్రీనివాసరావు చిన్న పిల్లల దసరా వేడుకలు.. చిన్ననాటి జ్ఞాపకాల గుర్తు చేసుకున్న కలెక్టర్ అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు పలాస, ఇచ్ఛాపురం మునిసిపల్ ఎన్నికల నిర్వహణపై ఫేజ్–1 శిక్షణ సమావేశం వికారాబాద్ నియోజకవర్గానికి రూ.5.90 కోట్ల నిధులు.. మూడు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి జీవోలు జారీ 'మిస్టర్ ఇండియా' పోటీల్లో సత్తా చాటిన ధిల్లేశ్వరరావు.... ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే గొండు శంకర్ దుర్గామాతను దర్శించుకున్న మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి నంగునూరు ఉద్యోగుల సంక్షేమ సంస్థ నూతన కార్యవర్గం మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన పాలకొండ సబ్-కలెక్టర్ డైరెక్టర్ల ఎన్నిక ఏకగ్రీవం హుస్నాబాద్‌ పురపాలక సంఘంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు

చండీదేవిగా కామాక్షి అమ్మవారు

Select Suryaa Now
చండీదేవిగా కామాక్షి అమ్మవారు

సిఎస్ పురం,మేజర్ న్యూస్,,విజయదశమి పండుగ సందర్భంగా సిఎస్ పురంలోని శ్రీకామాక్షి సమేత చంద్రమౌళీశ్వరస్వామి దేవస్థానం నందు జరుగుతున్న దేవీశరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నాలుగవరోజు బుధవారం శ్రీకామాక్షి అమ్మవారిని చండీదేవి అలంకరణ చేసి పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా ఉదయం దేవస్థానం అర్చకులు శ్రీకృష్ణశర్మ అధ్వర్యంలో ఉభయదాతలచే అభిషేకం కుంకుమార్చన పూజలు నిర్వహించి అలంకరణ చేసి పూజలు చేశారు అనంతరం ప్రత్యేక హోమపూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించి కర్పూరహారతులు సమర్పించి తీర్ధప్రసాదాలు అందజేశారు.అదేవిధంగా ఐదవరోజు గురువారం ఉదయం కామాక్షి అమ్మవారిని లలితత్రిపురసుందరీదేవి అలంకరణ చేసి పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా మహిళా భక్తజనమండలి అధికసంఖ్యలో పాల్గొని భజన సంకీర్తన అమ్మవారి పాటలతో సందడి చేశారు.దేవీశరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీకామాక్షి చంద్రమౌళీశ్వరస్వామి దేవస్థానం ఆవరణ భక్తజనసందడితో కోలాహలం నెలకొన్నది.ఈకార్యక్రమంలో దేవస్థానం అభివృద్ధి కమిటీ ప్రతినిధులు,ఉభయదాతలు నాయుడు నారాయణ,కొమ్మినేని రమణయ్య,చావారమణయ్య దంపతులు,భక్తులు,స్థానికులు పాల్గొన్నారు.