ఢిల్లీలోని జంతర్‌మంతర్ నిరసన జాబితా నుండి తొలగించడాన్ని తీవ్రంగా ఖండించాం. నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి.
అచ్చంపేట సూర్యన్యూస్ : దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్‌ను అధికారిక నిరసన వేదికల జాబితా నుండి తొలగించడం (డీ-నోటిఫై చేయడం), ఓటర్ల జాబితా సవరణల్లో అక్రమాలు జరిగాయంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సి.ఇ.సి) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్ చేసామని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి అన్నారు.గురువారం అచ్చంపేట పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తో కలిసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎంపీ డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూదశాబ్దాలుగా ప్రజాస్వామ్య పద్ధతిలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తమ నిరసనలను వ్యక్తం చేయడానికి జంతర్ మంతర్ ప్రధాన కేంద్రంగా ఉండేది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కమిటీ సిఫార్సుల మేరకు దీనిని నిరసనల జాబితా నుండి తొలగించడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయని
ప్రజల గొంతుకను నొక్కేసే ప్రయత్నాల్లో భాగంగానే జంతర్ మంతర్‌ను రద్దు చేశారని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ఈ వేదికను యథావిధిగా కొనసాగించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.ఎన్నికల కమిషనర్ రాజీనామా ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (సర్ ) ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, ఫారం-6 దరఖాస్తుల విషయంలో పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపిస్తూ సి.ఇ.సి జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఇండియా కూటమి మరియు వివిధ పార్టీల నాయకులు ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు.కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.