డబ్బా గ్రామ సమీపంలో కారు-బైక్ ఢీ - మహిళకు తీవ్ర గాయాలు
సూర్య చింతల మానేపల్లి: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామ పెట్రోల్ బంకు సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన కారు, బైక్ ఢీకొనడంతో బైక్ పై వెళుతున్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో ఆమె కాలు విరిగినట్లు సమాచారం.. వెంటనే స్పందించిన స్థానికులు తీవ్ర గాయాలపాలైన మహిళను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సింది.