గుడుపల్లిలో రేపు టీడీపీ సర్వసభ్య సమావేశం
గుడుపల్లి మేజర్ న్యూస్ : మండలంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణపై చర్చించేందుకు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు ఎస్. సుబ్రమణి (సుబ్బు), ప్రధాన కార్యదర్శి వి. సురేష్ తెలిపారు. మండలంలోని శ్రీ ప్రసన్న రాళ్లగంగమ్మ దేవాలయం సమీపంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ సమావేశానికి మండల కోర్ కమిటీ సభ్యులు, క్లస్టర్, కో-క్లస్టర్, యూనిట్, కో-యూనిట్ ఇన్ఛార్జులు, పంచాయతీ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, బూత్ ఇన్ఛార్జులు, కో-బూత్ ఇన్ఛార్జులు, తెలుగు యువత, తెలుగు మహిళా ప్రతినిధులు, ఐటీడీపీ సభ్యులు, ఏఎంసీ, రెస్కో డైరెక్టర్లు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా హాజరుకావాలని వారు కోరారు. పార్టీ ఎన్నికల కార్యాచరణను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలందరూ సమావేశంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
రిపోర్టర్ లెనిన్, గుడుపల్లి, కుప్పం నియోజకవర్గం