BREAKING
48 గంటల్లోనే నిందితులను అరెస్ట్ అర్బన్ సీఐ ఆర్ఎస్ కిషోర్ కుమార్ ఎస్సై బి జగన్మోహన్ రావును అభినందించిన ఎస్పీ వకుల్ జిందాల్ మండపేట మున్సిపల్ ఎన్నికల్లో తొలిరోజు నామినేషన్లు నిల్ ఎథనాల్ ఉత్పత్తికి చెరకు మళ్లింపుపై కేంద్రం కీలక నిర్ణయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లమిల్లి కడ్తాల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్న టిడిపి మాజీ కౌన్సిలర్ వర్షాభావ నష్టాలపై కొత్తపల్లిలో గ్రామసభ పోలీసులకు నర్సరీ అసోసియేషన్ వినతి పతంజలి యోగ కేంద్రంలోని అమ్మవారికి మున్సిపల్ చైర్మన్ దంపతుల పూజలు జూనియర్ సివిల్ జడ్జి మనీషాకు ఘన సన్మానం అన్నప్రసాద వితరణ ప్రారంభించిన కౌన్సిలర్‌ రాకేష్‌రెడ్డి కోకాకోలా వైపు కేఎఫ్‌సీ మొగ్గు కణ్ణగి – కోపాగ్ని హాలీవుడ్‌కు సవాల్ విసురుతున్న మైక్రోడ్రామాలు హిందూపురంలో అంతర్రాష్ట్ర ఎక్సైజ్ అధికారుల సమావేశం

గన్నవరం ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో ఘనంగా డా. ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతి వేడుకలు..

Select Suryaa Now
గన్నవరం ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో ఘనంగా డా. ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతి వేడుకలు..

గన్నవరం, మేజర్ న్యూస్.

భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా. ఏపీజే అబ్దుల్‌ కలాం 95వ జయంతి సందర్భంగా గన్నవరం ప్రథమ శ్రేణి గ్రంథాలయం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రంథాలయాధికారి కె. నాగరాజు, గ్రంథాలయ సభ్యులు కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రంథాలయాధికారి కె. నాగరాజు మాట్లాడుతూ డా. ఏపీజే అబ్దుల్‌ కలాం ఒక వ్యక్తి మాత్రమే కాదని, దేశ యువతకు స్ఫూర్తినిచ్చిన మహాశక్తి అని కొనియాడారు. రాష్ట్రపతి భవన్‌ నుంచి పాఠశాల తరగతి గది వరకు ప్రతి ఒక్కరికీ ఆయన జీవితం ఆదర్శప్రాయమన్నారు. కలాం ఇచ్చిన “కలలు కనండి.. ఆ కలలను సాకారం చేసుకోండి” అనే సందేశం నేటి యువతకు దిక్సూచిగా నిలుస్తుందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, దేశ అభివృద్ధికి తమ వంతు సేవలందించాలని పిలుపునిచ్చారు. కలాం చూపిన మార్గంలో నిజాయితీ, క్రమశిక్షణ, నిరంతర కృషితో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాఠకులు, సిబ్బంది, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సూర్య ప్రతినిధి: గుర్రం ప్రసాద్, గన్నవరం, కృష్ణాజిల్లా.